బ్లాక్ లిస్టులో పాక్‌!

August 23, 2019
img

కశ్మీర్‌ సమస్యపై భారత్‌తో యుద్ధానికి సైతం వెనుకాడబోమని ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్థాన్‌కు ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ టీం (ఎఫ్ఎటిఎఫ్)షాక్ ఇచ్చింది. ఉగ్రవాద నిరోధానికి తాము సూచించిన విధంగా తగిన చర్యలు తీసుకోనందుకు ఇప్పటికే పాకిస్థాన్‌ను గ్రే లిస్టులో చేర్చిన ఆ సంస్థ ఇప్పుడు బ్లాక్ లిస్టులో చేర్చేందుకు సిద్దమవుతోంది. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో జరుగుతున్నా ఆసియా పసిఫిక్ గ్రూప్ సమావేశంలో పాల్గొన్న 42 మంది సభ్యులలో అధికశాతం పాక్‌ చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఈ ఏడాది అక్టోబర్ వరకు పాకిస్థాన్‌కు సమయం ఇవ్వాలని నిర్ణయించాయి. ఒకవేళ అప్పటికీ పాక్‌ తీరు మారకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాలని నిర్ణయించారు.

ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సాయం అందజేయడం, వాటి ఆర్ధికలావాదేవీలను అనుమతించడం వంటి చర్యలను ఎఫ్ఎటిఎఫ్ నిశితంగా పరిశీలిస్తుంటుంది. ఉగ్రవాదసంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌, తాము స్వయంగా ఉగ్రవాద పీడిత దేశమని చెప్పుకొంటూ ప్రపంచదేశాల నుంచి, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకొంటుంటుంది. గ్రే లిస్టులో పెట్టినందుకే పాకిస్థాన్‌కు ప్రపంచంలో ఎక్కడా అప్పు పుట్టడం లేదు. ఒకవేళ పాకిస్తాన్ పేరు బ్లాక్ లిస్టులో చేర్చితే ఇక ఆ దారులు కూడా మూసుకుపోతాయిఅప్పుడు పాక్‌ పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉంటుంది. కనుక భారత్‌పైకి ఉగ్రవాదులను పంపించే ప్రయత్నాలు మానుకొకపోతే దానికే నష్టం. 

Related Post