గ్రీన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్

July 11, 2019
img

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి దినదినగండంగా జీవిస్తున్న ఎన్ఆర్ఐలకు మొట్టమొదటిసారిగా ట్రంప్ సర్కార్ నుంచి ఒక శుభవార్త వినిపించింది. విదేశీయులు అమెరికాలో శాస్వితంగా స్థిరపడేందుకు వీలు కల్పించే గ్రీన్ కార్డుల మంజూరుకు ఉన్న 7 శాతం పరిమితిని ఎత్తివేయడానికి అమెరికన్ కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఆమోదం తెలిపింది. అమెరికా ప్రభుత్వం ఏటా 1.4 లక్షల గ్రీన్ కార్డులు మంజూరు చేస్తోంది. అయితే ఒక్కో దేశానికి 7 శాతం చొప్పున గ్రీన్ కార్డులు మంజూరు చేస్తున్నందున గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు దశాబ్ధాల తరబడి ఎదురుచూడవలసి వస్తోంది. వారిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారు. ఇప్పుడు 7 శాతం పరిమితిని తొలగించడంతో భారత్‌, చైనా, ఫిలిపిన్స్ దేశాల పౌరులకు ఎక్కువ గ్రీన్ కార్డులు లభించే అవకాశం ఉంది.

భారత సంతతికి చెందిన సెనేటర్ (ఎంపీ) కమలా హ్యారీస్, ఆమె అనుచరుడు మైక్ లీ కలిసి గత ఫిబ్రవరిలో ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమ్మిగ్రెంట్‌ యాక్ట్‌ (హెచ్‌ఆర్‌1044) బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఇటువంటి బిల్లునే జో లాఫ్గ్రెన్‌, కెన్‌ బక్‌లు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో కుటుంబాల తరపున (ఫ్యామిలీ స్పాన్సర్డ్) వచ్చేవారికి 15 శాతం గ్రీన్ కార్డులు కేటాయించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్‌ ఆమోదముద్ర వేసింది కనుక గ్రీన్ కార్డు కోసం ఎదురుచూసే సమయం గణనీయంగా తగ్గవచ్చు. 


Related Post