అమెరికాలో ఇద్దరబ్బాయిల పెళ్ళి

July 09, 2019
img

కొన్ని రోజుల క్రితం వారణాసిలో ఇద్దరు అమ్మాయిలు పెళ్ళి చేసుకొన్నప్పుడు ఆ వార్తా దేశంలో అన్ని మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యింది. ఇప్పుడు అటువంటిదే అమెరికాలో మరో పెళ్ళి జరిగింది. ఈసారి ఇది ‘వరూవరుల పెళ్ళి.’ అంటే ఇద్దరు అబ్బాయిలు ఒకరినొకరు పెళ్ళి చేసుకున్నారు. 

వారిలో ఒక పెళ్ళికొడుకు పరాగ్ అమెరికాలో మాస్టర్ కార్డ్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ మరియు యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసస్ కు సీనియర్ అడ్వైజర్. మరొక పెళ్ళికొడుకు వైభవ్ అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసర్చ్‌లో రీసర్చ్ అసోసియేట్‌. ఇద్దరూ స్వలింగ సంపర్కులు కావడంతో వారు అమ్మాయిలను వివాహం చేసుకునేందుకు ఇష్టపడలేదు. అమెరికాలో వారి పరిచయం ప్రేమగా మారడంతో ఇరుకుటుంబాల పెద్దలు దగ్గరుండి వారికి ఘనంగా వివాహం జరిపించారు. పెద్దలే దగ్గరుండి ఈ కార్యక్రమం జరిపించడంతో బందుమిత్రులు కూడా తరలివచ్చి ఆ నూతన దంపతులను(!) ఆశీర్వదించి వెళ్ళారు. ఈ సంఘటన అమెరికాలో టెక్సాస్ నగరంలో జరిగింది. బహుశః ఇక ముందు ఇటువంటి పెళ్లిళ్లు సాధారణమైపోయినా ఆశ్చర్యం లేదు. కనుక ఎవరైనా పెళ్ళికి పిలిస్తే పెళ్ళికూతురు ఎవరు? లేదా పెళ్ళి కొడుకు ఎవరు? అని ప్రశ్నించకుండా ఉంటేనే మంచిదేమో?

Related Post