ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు ఆత్మహత్య!

June 28, 2019
img

మానసిక సమస్యలతో బాధపడేవారికి మానసిక వైద్య నిపుణులు తమ వైద్యంతో స్వాంతన చేకూర్చుతుంటారని అందరికీ తెలుసు. ఆత్మహత్యకు పాల్పడాలనుకునేవారికి సైతం మళ్ళీ జీవితంలో ఒడిదుకులను తట్టుకుని నిలబడేందుకు తగిన మనోధైర్యం వారు కల్పిస్తుంటారు. కానీ మానసిక సమస్యలకు వైద్య చికిత్సలు చేసే మానసిక వైద్యుడే తెలియని సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటే? అదే జరిగింది. 

టెక్సాస్ లోని ఫోర్ట్ వర్త్ నగరంలో గత 43 ఏళ్లుగా మానసిక వైద్య నిపుణురాలుగా పనిచేస్తున్న డాక్టర్ ఝాన్సీ రాజ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తన కారును రోడ్డుపక్కన ఉన్న ఒక సరస్సులోకి నడిపించుకుంటూ వెళ్ళి కారుతో సహా నీటిలో మునిగి చనిపోయారు. ఆమె 1995లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ప్రవాస భారతీయ సంఘాల కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనే ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ దిగ్బ్రాంతి చెందారు. ఆమె ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి ఏమి కలిగిందని విచారిస్తున్నారు. ఝాన్సీ రాజ్‌ 1976లో  హైదరాబాద్‌ ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. ఆ తరువాత అమెరికా వెళ్ళిపోయి అక్కడే మానసిక వైద్య నిపుణురాలిగా సేవలందిస్తూ మంచిపేరు సంపాదించుకున్నారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆమె మృతికి సంతాపం తెలిపింది.

Related Post