జూలై 4 నుంచి వాషింగ్టన్‌లో తానా మహాసభలు

June 11, 2019
img

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ వార్షిక మహాసభలు జూలై 4 నుంచి 6వరకు వాషింగ్టన్‌లోని 801 మౌంట్ వెర్షన్ ప్లేస్ వద్ద గల వాల్టర్ ఈ వాషింగ్టన్‌ కన్వెన్షన్ సెంటర్లో జరుగనున్నాయి. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా తానా స్టార్ట్-అప్ క్యూబ్ కాంటెస్ట్ నిర్వహించబోతోంది. ఔత్సాహిక వ్యవస్థాపకులను, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం తానా క్యూబ్ కాంటెస్ట్ ప్రధానోద్దేశ్యం. 

మంచి అభివృద్ధికి అవకాశాలు కలిగి ఇంకా ఆరంభదశలో ఉన్న సంస్థల వ్యవస్థాపకులను గుర్తించి వారికి అవసరమైన సహాయసహకారాలు, పెట్టుబడి అందించి వారు మరోమెట్టు ఎక్కేందుకు ఈ వేదిక తోడ్పడుతుంది. 

ఔత్సాహిక వ్యవస్థాపకులకు ఈ పోటీలో పాల్గొనడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే... 

1. మీ ఆలోచనలను, ఉత్పత్తుల గురించి, వాటికి గల వ్యాపారావకాశాల గురించి ఈ కార్యాక్రమంలో పాల్గొనబోయే పెట్టుబడిదారులకు స్వయంగా వివరించవచ్చు. 

2. సంబంధిత రంగంలోని నిపుణుల సలహాలు మీకు లభిస్తాయి. 

3. మీ స్టార్ట్-అప్ కంపెనీ గురించి మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. 

4. పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్న వారితో వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు. 

5. మీ ఆలోచనలు..ఉత్పత్తులకు నిపుణుల ఆమోదం లభిస్తే భారీ నగదు బహుమతులు కూడా లభిస్తాయి.         

కనుక సరికొత్త ఆలోచనలతో…మంచి ప్రభావంతమైన స్టార్ట్-అప్ కంపెనీలను స్థాపించిన లేదా స్థాపించదలచిన   ఔత్సాహిక వ్యవస్థాపకుల నుంచి తానా స్టార్ట్-అప్ క్యూబ్ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మార్గదర్శకాలు: 

1. ఈ పోటీలో పాల్గొనే అభ్యర్ధుల దరఖాస్తులను తానా నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి వారిలో పోటీకి అర్హమైన 6-8 మందిని ఎంపిక చేస్తుంది. 

2. తానా స్టార్ట్-అప్ క్యూబ్ కాంటెస్ట్ కు ఎంపికైనవారు తమ ఆలోచనలు, ఉత్పత్తులు లేదా సేవలు వాటికి గల వ్యాపారాభివృద్ధి అవకాశాలు, ఆర్ధిక, సాంకేతిక అంశాల గురించి జడ్జీలకు, పెట్టుబడిదారులకు 8 నిమిషాలలో లైవ్ డెమో లేదా ప్రెజెంటేషన్ ద్వారా వివరించవలసి ఉంటుంది. ఆ తరువాత 5 నిమిషాలపాటు జడ్జీలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. ఈ పోటీలో ఎన్నికయినవారికి ప్రధమ మరియు ద్వితీయ బహుమతులు ప్రధానం చేయబడతాయి.

దరఖాస్తు గడువు వివరాలు: ఈ పోటీలో పాల్గొనదలచిన వారు జూన్ 27వ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది. దరఖాస్తులను నేరుగా tanastartup2019@gmail.com కు ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు. 

                                     తానా స్టార్ట్-అప్ క్యూబ్ పిచ్ ఛాలెంజ్ 

                       చైర్: సతీష్ తుమ్మల   కో-చైర్: వేణు సంగాని,  కో-చైర్: సాయి జరుగుల 

                 తేదీ, సమయం: జూలై 5వ తేదీ. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.  

Related Post