ఫిలడెల్ఫియాలో రేవంత్‌ రెడ్డి విజయోత్సవ సభ

June 05, 2019
img

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా విజయం సాధించిన సందర్భంగా ఫిలడెల్ఫియాలో ఎన్నారైలు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి పార్టీలకు చెందిన దాదాపు 200 మందికి పైగా అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలు జరుపుకొన్నారు. తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా నిలుస్తున్న రేవంత్‌ రెడ్డి ఎంపీగా గెలవడం తమకు చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ సమాజానికి అండగా నిలిచినందుకు వారు రేవంత్‌ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసారు.
Related Post