ఫిలడెల్ఫియాలో తెలంగాణ దినోత్సవ వేడుకలు

May 23, 2019
img

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అమెరికాలో  ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకొన్నారు. ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ (పిటిఏ) అధ్వర్యంలో మాల్వేర్న్ పట్టణంలో ఫొనిక్స్ విల్లే పైక్ ప్రాంతంలో గల గ్రేట్ వ్యాలీ హైస్కూల్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పిటిఏ సభ్యులందరూ తమ కుటుంబాలతో సహా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అదేవిధంగా సభ్యులందరూ కలిసికట్టుగా ఆడిపాడుతూ సరదాగా సంతోషంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొన్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి స్వయంగా వంటలు చేసుకొని అచ్చమైన తెలంగాణ రుచులను ఆస్వాదించారు. 


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జూన్ 4వ తేదీన మాల్వేర్న్  పట్టణంలో970 పులస్కీ డిఆర్, కింగ్ ఆఫ్ పృష్యా వద్ద ఉదయం 8 గంటల నుంచి 4వ ఫ్రెండ్షిప్ కప్-2019 వాలీబాల్ టార్న్మెంట్ కూడా నిర్వహించబోతున్నారు.


Related Post