ఆటా-తెలంగాణ నూతన కార్యవర్గం ఎన్నిక

May 09, 2019
img

తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రంలోని ప్రజలు ఎంతగా తాపత్రయపడుతుంటారో, అమెరికాలో స్థిరపడిన ప్రవాస తెలంగాణవాసులు కూడా అంతే తాపత్రయపడుతుంటారు. వారు రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉడతాభక్తిగా రాష్ట్రానికి సేవ చేస్తుంటారు. వారందరూ కలిసి ఏర్పాటు చేసుకొన్నదే అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌. దాని ప్రస్తుత బోర్డు సభ్యుల పదవీకాలం ముగుస్తుండటంతో డెట్రాయిట్ నగరంలో జరిగిన ఆటా అసోసియేషన్ బోర్డు మీటింగులో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. 

అమెరికాలో తెలుగువారు ఏర్పరచుకొన్న అసోసియేషన్ల పేర్లన్నీ ఇంచుమించు ఒకే విధంగా ఉండటంతో ఏర్పడుతున్న గందరగోళాన్ని నివారించేందుకు ఇకపై అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ను ‘ఆటా-తెలంగాణ’గా వ్యవహరించాలని బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. నూతన కార్యవర్గం పదవీకాలం ఈ ఏడాది జూన్ నుంచి 2020 డిసెంబర్ వరకు ఉంటుంది. మళ్ళీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఫ్లోరిడాలో నూతన కార్యవర్గం సమావేశం జరుగుతుంది. 

ఆటా-తెలంగాణ నూతన కార్యవర్గంలో సభ్యుల వివరాలు: 

ఛైర్మన్: మాధవరం కరుణాకర్, 

అధ్యక్షుడు: వినోద్‌ కుకునూరు. 

ప్రెసిడెంట్ ఎలెక్ట్: నరేందర్ చేమర్ల

ప్రధాన కార్యదర్శి: వెంకట్ మంతెన, 

ఉప కార్యదర్శి: చందు తాళ్ళ,

కోశాధికారి: రామచంద్రారెడ్డి,

ఉప కోశాధికారి: శ్రీనివాస్ రెడ్డి బండారపు

నేషనల్ కొ-ఆర్డినేటర్: రవి దన్నపునేని,

కల్చరల్ అడ్వైజర్: పద్మజారెడ్డి,

ఓవర్సీస్ సలహాదారు: రామచంద్రారెడ్డి భానాపురం,

సలహాదారులు: కరుణాకర్ మాధవరం, ఏఎన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి కందిమళ్ళ, ఈట గునిగంటి ప్రభాకర్ రావు, ఈట భాస్కర్ వేనేపల్లి. 

నూతన సభ్యులు: అరవింద్ తక్కెళ్ళపల్లి, అమరేందర్ రెడ్డి తిప్పర్తి, చందు తాళ్ళ, చంద్ర బొజ్జ, జగపతి వీరాటి, కృష్ణరంగరాజు, నరేందర్ చీమర్ల, నరసింహ నాగులవంచ, నవీన్ గడ్డం, పూర్ణ బైరి, ప్రీతం రెడ్డి కొమ్ముల, రఘువర్మ, రాజేష్ పింగళి, రఘు సుంకిరెడ్డి, రమేశ్ రెడ్డి, రఘువీర్ రెడ్డి మరిపెద్ది, రఘువర్ధన్ రెడ్డి గడిపల్లి, రామచంద్రా రెడ్డి ఆడె, రవి ఉపాడ్, సత్యనారాయణ రెడ్డి కందిమళ్ళ, శ్రీధర్ కంచనకుంట్ల, శ్రీధర్ బానాల, శ్రీనివాస్ రెడ్డి బాండారపు, సువర్ణ పప్పు, వెంకట్ అడప, విష్ణు మాధవరం, వెంకట్ మంతెన. 

Related Post