ఏడారిలో సాయం కోసం ఎదురుచూస్తున్న కరీంనర్‌వాసి

May 08, 2019
img

ఒకప్పుడు...నేటికీ కూడా గల్ఫ్ దేశాలు లక్షలాది భారతీయుల జీవితాలలో వెలుగులు నింపుతూనే ఉన్నాయి. అదేవిధంగా వేలాదిమంది జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయి కూడా. ఇక్కడ సమస్యలను పరిష్కరించుకోవడానికి అప్పో సప్పో చేసి గల్ఫ్ దేశాలకు వెళితే అక్కడా వారు భయంకరమైన సమస్యలలో కూరుకుపోతున్నారు. దాంతో వారు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లవుతోంది. కరీంనగర్‌ జిల్లా తుమ్మాపురం మండలంకు చెందిన రాజయ్య అనే వ్యక్తి అబుదాబీ ఎడారిలో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆ విషయం అతనే స్వయంగా సెల్ ఫోన్ లో వీడియో మెసేజ్ ద్వారా బయట లోకానికి తెలియజేసి ఎలాగైనా తనను కాపాడాలని వేడుకొంటున్నాడు. అతను ఏవిధంగా నరకయాతన అనుభవిస్తున్నాడో స్వయంగా మీరే చూడండి. చూసి ఏమైనా సాయపడగలరేమో ప్రయత్నించండి.

 


Related Post