అమెరికా పాఠశాలలో కాల్పులు...

May 08, 2019
img

అమెరికాలో గన్ కల్చర్ ఒక వికృత సంస్కృతి అనుకొంటే అభం శుభం ఎరుగని చిన్నారులపై కాల్పులు జరుపడం ఇంకా దారుణమైన ఆలోచన. విద్యార్దులు కూడా ఆ గన్ సంస్కృతిని అలవాటు చేసుకొని తోటి విద్యార్దులపై కాల్పులు జరుపడం ఆ విష సంస్కృతికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.  

కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్‌లోని ఇద్దరు దుండగులు స్థానిక స్టెమ్ స్కూలులోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ దాడిలో ఒక విద్యార్ది మరణించగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకొన్న పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకొని ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. వారిరువురు అదే పాఠశాలలో చదువుకొంటున్న విద్యార్దులని సమాచారం! కొలంబైన్ హైస్కూలు దాడి జరిగి 20 సం.లు జరిగిన సందర్భంగా డెనీవర్‌లో గల పాఠశాలలన్నీ సోమవారం మూసివేసి మళ్ళీ మంగళవారం తెరుచుకొన్నప్పుడు ఈ దాడి జరిగింది.    


Related Post