నదిలోకి విమానం...అందరూ సేఫ్

May 04, 2019
img

అమెరికాలో ఒక పెను ప్రమాదం తృటిలో తప్పిపోయింది. క్యూబా నుంచి 136 మంది ప్రయాణికులతో ఫ్లోరిడాలోని    గంటానమో బేలో నావల్‌ ఎయిర్ స్టేషన్‌కు చేరుకొన్న బోయింగ్‌ 737 కమర్షియల్‌ జెట్‌ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి సమీపంలోనే ఉన్న సెయింట్‌ జాన్స్‌ నదిలోకి దూసుకుపోయింది. అయితే వెంటనే పైలట్, విమాన సిబ్బంది విమానం తలుపులు తెరిచి విమానంలో ఉండే రక్షణ సాధనాలను వినియోగించి ప్రయాణికులందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. విమానాశ్రయ సహాయసిబ్బంది కూడా వెంటనే అక్కడకు చేరుకొని ప్రయాణికులను బయటకు తరలించి విమానం నీటిలో మునిగిపోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకొన్నారు. స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి 9.40 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరుగలేదు.   


Related Post