శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం

April 29, 2019
img

శ్రీలంకలో స్థానిక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థకు చెందిన కొందరు వ్యక్తులే వరుస బాంబుదాడులకు పాల్పడినట్లు గుర్తించడంతో పోలీసులు, భద్రతాదళాలు దేశవ్యాప్తంగా గాలింపుచర్యలు చేపట్టారు. వారి నుంచి తప్పించుకొనేందుకు ఉగ్రవాదులు బుర్ఖాలు ధరిస్తున్నట్లు నిఘావర్గాలకు అనునించడంతో ఉగ్రవాదుల ఏరివేతకు వీలుగా దేశంలో ఎవరూ బుర్ఖాలు ధరించరాదని శ్రీలంక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయి. ఇది దేశభద్రతకు సంబందించిన విషయం కనుక దేశంలో ముస్లిం పెద్దలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని అధ్యక్ష కార్యాలయ అధికారులు చెపుతున్నారు. 


Related Post