ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఔదార్యం

March 18, 2019
img

అమెరికాలో చదువుకొని అక్కడే ఉద్యోగాలు సంపాదించుకొని స్థిరపడాలనుకొనేవారు చాలా మందే ఉంటారు. కానీ తమ జీవితంలో ఆ స్థాయికి ఎదిగేందుకు దోహదపడిన అమెరికాకు మనం తిరిగి ఏమి ఇవ్వగలం? అని ఆలోచించేవారు కొందరే ఉంటారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) సభ్యులు అటువంటి మంచి ఆలోచనలతో ముందుకు సాగుతుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం మహిళా విభాగం చికాగోలోని 62,000 మంది చిన్నారులకు ఆహారం అందించింది. నాట్స్ మహిళా విభాగం సభ్యులు రోజా శీలంశెట్టి, రామ్ కొప్పాక, ముమ్మనగండి, సుమతి నెప్పల్లి, కల్యాణి కోగంటి, రాధ పిడికిటి, లక్ష్మి కలగర, కల్పన సుంకర, రాజీవ్ మన్నె తదితరులు కలిసి విరాళాలు పోగు చేసి 62,000 ఆహార పోట్లాలను తయారుచేసి స్కాంబర్గ్ లోని మై స్టార్వింగ్ చైల్డ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చిన్నారులకు వాటిని అందజేశారు. 


Related Post