ఇథియోపియన్ విమాన ప్రమాదంలో గుంటూరు యువతి మృతి

March 11, 2019
img

ఆదివారం ఉదయం కూలిపోయిన ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానంలో నలుగురు భారతీయులలో గుంటూరుకు చెందిన నూకవరపు మనీషా కూడా ఒకరు. ఆమె గుంటూరులో ఎంబీబీఎస్ పూర్తిచేసి అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే స్థిరపడ్డారు. నైరోబీలో ఉన్న తన అక్కను చూసేందుకు వెళుతుండగా దురదృష్టవశాత్తు విమానప్రమాదంలో మరణించారు.

ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో శిఖా గార్గ్, వైద్య పన్నగేష్ భాస్కర్, వైద్య హంసిన్ అన్నగేష్, నూకవరపు మనీషలను భారతీయులను అధికారులు గుర్తించారు. వారిలో శిఖా గార్గ్ అనే యువతి ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ప్రతినిధిగా పనిచేస్తున్నారు.

ఈ ప్రమాదం జరిగిన తరువాత అధికారులు ఆమె భర్తకు ఫోన్ చేసి ఈవిషయం తెలియజేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన ఫోన్ అందుబాటులో లేదని, తాను కూడా ప్రయత్నిస్తున్నానని   విదేశాంగశాఖ సుష్మాస్వరాజ్  ట్వీట్ చేశారు. కనుక శిఖా గార్గ్ స్నేహితులు లేదా బందువులు ఎవరైనా చొరవ తీసుకొని ఆమె కుటుంబసభ్యులకు ఈవిషయం తెలియజేయాలని లేదా వారి ఫోన్ నెంబర్లు ఉన్నట్లయితే విదేశాంగశాఖకు తెలియజేయాలని సుష్మాస్వరాజ్ విజ్ఞప్తి చేస్తున్నారు. 

Related Post