కూలిన ఇథియోపియా విమానం: 157 మంది మృతి

March 10, 2019
img

ఇథియోపియా ఎయిర్ లైన్స్ కు చెందిన (బోయింగ్ 737-800 మాక్స్) విమానం కూలిపోయింది. దానిలో ప్రయాణిస్తున్న 149 మంది ప్రయాణికులతో పాటు 8మంది విమాన సిబ్బంది కూడా మృతి చెందినట్లు సమాచారం. స్థానిక కాలమాన ప్రకారం అదివారం ఉదయం 8.38 గంటలకు ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి బయలుదేరిన విమానం కొద్ది సేపటికే కూలిపోయింది. దానిలో నలుగురు భారతీయులున్నారు. అమెరికా, బ్రిటన్, కెనెడా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇటలీ, చైనా, కెన్యా, ఇథియోపియా, ఈజిప్ట్  దేశస్థులున్నారు. ఈ ప్రమాదానికి కారణం తెలియవలసి ఉంది. 


Related Post