అమెరికాలో కాల్పులు...ఎప్పటికీ ఆగుతాయో?

February 15, 2019
img

అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఏటా అనేకమంది ప్రజలు, పిల్లలు బలైపోతూనే ఉన్నారు. స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు సెంట్రల్ చికాగో శివారులో ఇల్లినాయిస్‌ వద్దగల ఒక పారిశ్రామికవాడలో హెన్రీ ప్రాట్ అనే పైపుల తయారీ కంపెనీ వద్ద ఈ కాల్పుల ఘటన జరిగింది. ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరుపడంతో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకొన్న స్వాట్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆ దుండగుడిని కాల్చి చంపారు. కాల్పులు జరిపిన వ్యక్తి అదే కంపెనీలో పనిచేస్తున్న గేరీ మార్టి(45)గా పోలీసుకు గుర్తించారు. అతను ఎందుకు కాల్పులు జరిపాడో కారణం తెలియవలసి ఉంది. కారణం ఏదైనప్పటికీ, అమెరికాలో పిజ్జాలు, కూల్ డ్రింకులు లభించినంత సులువుగా తుపాకులు కూడా బజారులో లభిస్తున్నాయి కనుక ఆత్మరక్షణ కోసమంటూ వాటిని కొనడం, ఆ తరువాత ఏదో ఓ సందర్భంలో ఆవేశంలో వాటిని ఈవిధంగా దుర్వినియోగం చేయడం జరుగుతోంది. కనుక తుపాకుల సంస్కృతి ఉన్నంత కాలం ఈ మృత్యు ఘోష కూడా వినపడుతూనే ఉంటుంది. 

Related Post