విద్యార్ధులను విడిపించేందుకు ‘ఆటా’ ప్రయత్నాలు

February 05, 2019
img

ఉన్నత విద్యాభ్యాసం పేరుతో అక్రమంగా అమెరికాకు చేరుకొని గుట్టుగా ఉద్యోగాలు చేసుకొంటున్నవారిని పట్టుకునేందుకు ఎఫ్.బీ.ఐ. అధికారులు ‘ఫర్మింగ్టన్‌ యూనివర్సిటీ’ అనే నకిలీ యూనివర్సిటీని సృష్టించి దాని ద్వారా మొత్తం 300 మందిని అరెస్ట్ చేశారు. వారిలో భారత్ కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. వారిలో రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. టెక్సాస్ జైలులో నిర్బందించబడిన వారిని విడిపించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు అన్ని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వారి చొరవ, అమెరికాలోని భారతీయ ఎంబసీ అధికారులు చేసిన ప్రయత్నాల కారణంగా ఇప్పటి వరకు 30 మంది విద్యార్ధులు జైలు నుంచి విడుదలై హైదరాబాద్‌ చేరుకున్నారు. త్వరలోనే మిగిలినవారిని కూడా విడిపించి క్షేమంగా స్వదేశానికి చేర్చేందుకు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆటా) కూడా తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా నకిలీ దృవపత్రాలతో ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఆరోపణలతో అరెస్ట్ అయిన 8 మందిని విడిపించేందుకు ఆటా న్యాయవాది రమేశ్ మంధన తీవ్రంగా కృషి చేస్తున్నారు.     


Related Post