అమెరికాలో విద్యార్ధులకు అండగా నిలబడిన తానా

January 31, 2019
img

అమెరికాలో ఉన్నతవిద్యాభ్యాసం పేరుతో నకిలీ దృవపత్రాలతో అక్రమంగా నివసిస్తున్న 200 మంది విద్యార్ధులను డెట్రాయిట్ పోలీసులు బుదవారం అరెస్ట్ చేశారు. వారందరికీ అండగా నిలబడి అవసరమైన న్యాయసహాయం అందించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. నాట్స్ ఛైర్మన్ శ్రీనివ్స్ గుత్తికొండ, అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి కలిసి పోలీసుల చెరలో ఉన్న విద్యార్ధులను విడిపించి స్వదేశానికి పంపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. న్యూజెర్సీలో స్థిరపడిన ప్రముఖ న్యాయనిపుణులు శ్రీనివాస్ జొన్నలగడ్డతో వారు ఈ సమస్యపై చర్చించారు. అమెరికా చట్టాల ప్రకారం వారిని విడిపించేందుకు ఉన్న అన్ని అవకాశాలను వారు పరిశీలిస్తున్నారు. త్వరలోనే విద్యార్ధులను బెయిలుపై విడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.    

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విద్యార్ధులను గుర్తించడానికి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ‘యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్ టన్’ అనే ఒక నకిలీ యూనివర్సిటీని సృష్టించారు. దానిపేరిట మీడియాలో ప్రకటనలు ఇస్తూ అక్రమంగా నివసిస్తున్న విద్యార్ధులను ఆకర్షించి వారి వివరాలు తెలుసుకొని అరెస్టులు చేస్తున్నారు. 

Related Post