ఎఫ్.బి.ఐ.ఉచ్చులో భారతీయ విద్యార్దులు

January 31, 2019
img

అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న వ్యతిరేక పరిస్థితుల గురించి తెలిసి ఉన్నప్పటికీ నేటికీ అనేకమంది యువత అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకొని స్థిరపడాలని కలలుకంటూ అమెరికాలో అడుగుపెట్టి చివరికి జైలు పాలవుతున్నారు. 

వారి బలహీనతను కనిపెట్టి కొన్ని నకిలీ యూనివర్సిటీలు పుట్టుకొచ్చాయి. వాటి నిర్వాహకులు వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేసుకొని ఉన్నతవిద్యాభ్యాసం పేరుతో వారిని అమెరికాకు వచ్చేందుకు నకిలీ దృవపత్రాలు ఇస్తున్నాయి. వాటితో అమెరికాలో అడుగుపెడుతున్న యువత అక్రమంగా అమెరికాలో నివసిస్తూ ఉద్యోగాలు చేసుకొంటున్నారు. వారిలో అనేకమంది ఏనాడూ సదరు యూనివర్సిటీలకు రాలేదని, ఆ యూనివర్సిటీ ఎటువంటి శిక్షణా తరగతులు జరగడంలేదని, నామమాత్రంగా జరుగుతున్నా  వాటిలో సదరు విద్యార్ధులు పాల్గొనడంలేదని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. 

ఉన్నతవిద్యాభ్యాసం పేరుతో జరుగుతున్న ఈ అక్రమాలను గుర్తించిన ఎఫ్.బి.ఐ. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న అటువంటి విద్యార్ధులను గుర్తించి పట్టుకునేందుకు ‘యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్ టన్’ అనే ఒక నకిలీ యూనివర్సిటీని సృష్టించింది. దానికి భవనాలు, సిబ్బంది, అధ్యాపకులు, కోర్సులు, క్లాసులు ఏవీ లేవు. కానీ ఆ యూనివర్సిటీ జారీ చేసిన ప్రకటనలు చూసి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న కొంతమంది యువత యూనివర్సిటీ అధికారులుగా పరిచయం చేసుకున్న ఎఫ్.బి.ఐ. అధికారులతో మాట్లాడి తమ పూర్తి వివరాలు అందించారు. ఆ వివరాల ఆధారంగా పోలీసులు అమెరికాలోని వివిద ప్రాంతాలలో నివశిస్తున్న 8 మందిని బుదవారం అరెస్ట్ చేశారు. వారు స్టూడెంట్స్ రిక్రూటర్స్ పేరుతో సుమారు 600 మందికి నకిలీ దృవపత్రాలను ఇచ్చినట్లు ఎఫ్.బి.ఐ. అధికారుల ఆరోపిస్తున్నారు. 

అరెస్ట్ అయిన యువకుల పేర్లు:  

భరత్ కాకిరెడ్డి (29) లేక్ మేరీ, ఫ్లోరిడా.

అశ్వంత్ నూనె (26) అట్లాంట

సురేశ్ రెడ్డి కండాల (31) కుల్ పెప్పర్, వర్జినీయా

ఫణిదీప్ కమాటి (35) లూయిస్ విల్లీ, కెంటకీ

ప్రేమ్ కుమార్ రాంపీస (26) ఉత్తర కరోలినా

సంతోష్ రెడ్డి సామ (28) ఫ్రీమొంట్, కాలిఫోర్నియా 

అవినాష్ తక్కళ్ళపల్లి (28) హారిస్ బర్గ్, పెన్సైలన్వెనియా  

నవీన్ ప్రత్తిపాటి (29) డల్లాస్ 

Related Post