ఐటిసర్వ్ అలయన్స్ ఎల్.ఏ. ఛాప్టర్ కిక్ ఆఫ్ ఈవెంట్

January 30, 2019
img

అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్స్ మరియు సేవలు అందిస్తున్న సంస్థలతో కూడిన అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ ఐటిసర్వ్ అలయన్స్. అమెరికా వ్యాప్తంగా ఉన్న ఐటిసర్వ్ అలయన్స్ 13 ఛాప్టర్స్ లలో 1,000కి పైగా ప్రముఖ ఐ‌టి కంపెనీలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. త్వరలో ఐటిసర్వ్ అలయన్స్ లాస్ ఏంజలీస్ నగరంలో 14వ ఛాప్టర్ ను ప్రారంభించబోతోంది. 

అమెరికా కాలమాన ప్రకారం 2019, ఫిబ్రవరి 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు లాస్ ఏంజలీస్ నగరంలో 12725 సెంటర్ కోర్టు డ్రైవ్, సెర్రిటస్, సిఏ 90703, షేర్టన్ సెర్రిటస్ హోటల్లో ఐటిసర్వ్ అలయన్స్ 14వ ఛాప్టర్ ప్రారంభం కాబోతోంది.  

ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న కొందరు ప్రముఖులు బిజినెస్ ఇమ్మిగ్రేషన్ అనే అంశంపై తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తూ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రముఖులు:

మూర్తి లా ఫిర్మ్ ప్రెసిడెంట్ మరియు వ్యవస్థాపకులు శ్రీ షీలా మూర్తిగారు:

ప్రసంగించబోయే అంశం: బిజినెస్ ఇమ్మిగ్రేషన్ విధానంలో ఇటీవల నెలకొన్న గందరగోళ పరిస్థితులు-వాటిని ఐ‌టి కంపెనీలు ఏవిధంగా అధిగమించాలి?


ఎకనామిక్ ఇమ్మిగ్రేషన్ విభాగంలో లిటిగేషన్ డైరెక్టర్ శ్రీ జొనాధన్ వాస్దెన్:      

ప్రసంగించబోయే అంశం: అనధికారికంగా యు.ఎస్.సి.ఐ.ఎస్. అమలుచేస్తున్న విధానాలను ఎదుర్కోవడం మీరు ఊహించినదానికంటే సులభమే..అని ఐటిసర్వ్ అలయన్స్  నిరూపించింది. 

ఛగ్ లీగల్ కన్సల్టెంట్/అటార్నీ శ్రీ బృందా గాంధీ: 

ప్రసంగించబోయే అంశం: మీ బిజినెస్ (వ్యాపారలావాదేవీలు)లో రిస్క్ మరియు లయబిలిటీని ఏవిధంగా తగ్గించుకోవచ్చు?   

ఐటిసర్వ్ అలయన్స్ కు నేతృత్వం వహిస్తున్న 150 ఐ‌టి కంపెనీల అధినేతలు, ప్రతినిధులు, సభ్యులు, ఇంకా అనేకమంది ఔత్సాహికులు లాస్ ఏంజలీస్ నగరంలో జరుగబోతున్న ఐటిసర్వ్ అలయన్స్ 14వ ఛాప్టర్ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. అమెరికాలోని ఐ‌టి రంగానికి చెందిన వారెవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కానీ ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబందించి పూర్తి వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కోసం prmedia @ itserve.org అనే వెబ్ సైటులో పబ్లిక్ రిలేషన్స్ సభ్యులను సంప్రదించవచ్చు. 

ఐటిసర్వ్ అలయన్స్ గురించి క్లుప్తంగా: 

అమెరికాలో 1,000కి పైగా ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్స్ మరియు సేవలు అందిస్తున్న సంస్థలతో కూడిన అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ ఐటిసర్వ్ అలయన్స్. అమెరికా వ్యాప్తంగా ఉన్న ఐటి కంపెనీలకు వేదికగా నిలుస్తూ వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తునందున నానాటికీ దీనిలో అనేక ఐ‌టి కంపెనీలు సభ్యులుగా చేరుతున్నాయి. 

స్టెమ్ ఓటిపి విద్యార్ధులు తాము చేస్తున్న సంస్థలలో కాక వేరే ఇతర సంస్థలలో పనిచేయకుండా నిషేదించడానికి యు.ఎస్.సి.ఐ.ఎస్. అధికారిక వెబ్ సైటులో చేసిన ప్రయత్నాన్ని ఐటిసర్వ్ అలయన్స్ విజయవంతంగా అడ్డుకొంది.

RSVP mandatory: https://www.itserve.org/meetid?id=2UQKD1RFCL 

Refer a new member : www.itserve.org/register 

Follow us on LinkedIn: https://www.linkedin.com/company/7794223/    

Like us on Facebook: https://www.facebook.com/ITServeAlliance/    

Tweet us at : https://twitter.com/itserveorg?lang=en

Related Post