ఆ ముగ్గురి మృతదేహాలు నేడు నల్గొండకు

January 18, 2019
img

నల్గొండ జిల్లా నేరుడుగొమ్మ మండలంలోని గుర్రపుతండాకు చెందిన అన్నా చెల్లెళ్ళు సాత్విక్‌ (16), సుహాన్‌(15), జయ సుచిత్‌(14) ముగ్గురూ గతనెల అమెరికాలో  ఒక పరిచయస్తుల ఇంట్లో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నపుడు జరిగిన అగ్నిప్రమాదంలో సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం వారి అవశేషాలు అమెరికా నుంచి హైదరాబాద్‌ శంషాబాద్ విమానాశ్రయం చేరుకొన్నాయి. వాటిని నారాయణగూడ బాప్టిస్ చర్చికి తరలించి అక్కడ జరుపవలసిన కార్యక్రమాలు జరిపిన తరువాత వారి స్వగ్రామమైన గుర్రపుతండాకు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు. 


Related Post