అమెరికాలోఅగ్నిప్రమాదం: ముగ్గురు నల్గొండ యువత మృతి

December 26, 2018
img

అమెరికాలో కోర్‌విల్‌లో మంగళవారం సాయంత్రం ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.

నల్గొండ జిల్లా నేరేడుకొమ్మ మండలం గుర్రపుతండాకు చెందిన సాత్విక్ నాయక్‌, సుహాస్ నాయక్‌, జయసుచిత్‌ ముగ్గురూ అక్కా చెల్లి, తమ్ముడు. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవడానికి వారు ముగ్గురూ అమెరికాకు వచ్చి కోర్‌విల్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అక్కడే నివాసం ఉంటున్న తమ పరిచయస్తులైన పెద్ద డేనీ ఇంట్లో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు వారు ముగ్గురూ హాజరయ్యారు. 

నిన్న మంగళవారం పెద్ద డేనీ కుటుంబంతో కలిసి అందరూ క్రిస్మస్ వేడుకల హడావుడిలో ఉండగా అకస్మాత్తుగా ఆ ఇంట్లో మంటలు అంటుకొన్నాయి. పెద్ద డేనీ, ఆయన కుమారుడు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు కానీ ఆయన భార్యతో సహా సాత్విక్ నాయక్‌, సుహాస్ నాయక్‌, జయసుచిత్‌ ముగ్గురూ తప్పించుకోలేక మంటలలో సజీవ దహనం అయ్యారు. తమ పిల్లలు ముగ్గురూ ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయారని తెలిసిగుర్రపుతండా మండలంలో ఉంటున్న వారి తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి తండ్రి స్థానికంగా ఉన్న ఒక మిషనరీలో పనిచేస్తున్నారు.

Related Post