సానియాకు పండంటి మగబిడ్డ

October 30, 2018
img

ప్రముఖ క్రీడాకారులు షోయబ్ మాలిక్, సానియా మీర్జా దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. తల్లీ,బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, షోయబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మేము చాలా ఆనందంగా ఉన్నామని,     మీ అందరి ఆశీసులు కావాలని షోయబ్ ట్వీట్ చేశాడు. ఈవిషయం తెలియగానే భారత్, పాక్ తో సహా పలుదేశాల నుంచి పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సానియా, మాలిక్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడైన షోయబ్ మాలిక్ ను భారత్ కు చెందిన సానియా మీర్జా 2010లో వివాహం చేసుకొన్నప్పుడు ఇరుదేశాల ప్రజల నుంచి భిన్నస్పందనలు వచ్చాయి. కానీ ఆ తరువాత వారిరువురూ సుఖంగా కాపురం చేసుకొంటూ తమతమ దేశాల తరపున ఆడుతుండటంతో, వారి వివాహంపై మొదట్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినవారు సైతం ఆమోదిస్తున్నారు. సానియా మీర్జాకు ఇదే తొలి కాన్పు కావడంతో ఆమె చాలా కాలంగా టెన్నిస్ కు దూరంగా ఉంటోంది. 2020లో టోక్యోలో జరుగబోయే ఒలింపిక్ పోటీలలో ఆమె పాల్గొంటానని ఆమె తెలిపింది.

Related Post