హౌస్టన్ లో తెలంగాణావాసుల బోనాలు

August 08, 2018
img

తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హౌస్టన్ (టాగ్) ఆధ్వర్యంలో స్థానిక శిరిడిసాయి జలరాం మందిరంలో ఆగస్ట్ 5వ తేదీన  ఘనంగా బోనాల పండుగ నిర్వహించుకొన్నారు. ఈ బోనాలు పండుగ కార్యక్రమానికి సుమారు 600 మంది తెలంగాణావాసులు హాజరయ్యి భక్తిశ్రద్దలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకొన్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తాము ప్రతీ ఏటా బోనాల పండుగ జరుపుకొంటున్నమని టాగ్ అధ్యక్షులు విజయ్ దేవిరెడ్డి, ఉపాధ్యక్షులు వీరేందర్ తెలిపారు. శ్రీమతి పద్మ కొత్తకొండ అమ్మవారి బోనాలను ఏర్పటుచేయగా, ఈ పండుగకు విచ్చేసిన భక్తులు అందరికీ స్థానిక ‘బిర్యాని పాట్’ యజమాని శ్రీధర్ కాంచనకుంట్ల ప్రసాదం అందించారు. టెక్సాస్ నుంచి డెమోక్రాటిక్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ కులకర్ణి ఈ బోనాల కార్యక్రమం లో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


Related Post