ట్రంప్‌కు భారత్ ఆహ్వానం

August 02, 2018
img

ప్రతీఏటా డిల్లీలో జరిగే గణతంత్రదినోత్సవ వేడుకలకు ఒక విదేశీ ప్రధాని లేదా రాష్ట్రపతిని ఆహ్వానించడం ఆనవాయితీ. కనుక వచ్చే ఏడాది జరుగబోయే గణతంత్రదినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ముఖ్య అతిధిగా భారత్ ఆహ్వానించింది. అమెరికా రక్షణమంత్రి జేమ్స్ మాటిస్, విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో వచ్చే నెల భారత్ పర్యటనకు వచ్చినప్పుడు వారు భారత్ అధికారులతో డొనాల్డ్ ట్రంప్‌ భారత్ పర్యటన గురించి చర్చించిన తరువాత దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మూడేళ్ళ క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా గణతంత్రదినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భారత్ పర్యటనకు ట్రంప్‌ అంగీకరించినట్లయితే, అది ఇరు దేశాల సంబంధాలు బలపడేందుకు సహాయపడవచ్చు. రక్షణ, వ్యాపార, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు  తదితర అంశాలలో భారత్ కు ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు కానీ హెచ్-1 బి వీసాల తదితర అంశాలలో అమెరికా వైఖరిలో ఎటువంటి మార్పు ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు.     


Related Post