‘గ్రే లిస్టు’లో పాక్ పేరు

June 30, 2018
img

తీవ్రవాదులకు ఆర్ధికసహకారం అందిస్తున్న కారణంగా పాకిస్తాన్ దేశాన్ని ‘గ్రే లిస్టు’ లో చేర్చుతున్నట్లు పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రకటించింది. అంతర్జాతీయ ఆర్ధికభద్రతకు ప్రమాదకరమైన అంశాలను గుర్తించేందుకు ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. అది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉంది. తీవ్రవాదులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆర్ధికసహాయం అందించడం ద్వారా ప్రపంచశాంతికి విఘాతం కలుగుతుందని కనుక అటువంటి పనులను మానుకోవాలని హెచ్చరిస్తూనే ఉంది. పాక్ ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించి ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు 26 అంశలతో కూడిన ఒక ప్రతిపాదనను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కు సమర్పించింది. కానీ ఆ ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా లేకపోవడంతో పాకిస్తాన్ దేశాన్ని ‘గ్రే లిస్టు’లో చేర్చుతున్నట్లు ప్రకటించింది.

ఈ ‘గ్రే లిస్టు’లో చేర్చబడిన దేశానికి ప్రపంచదేశాల నుంచి సహకారం కొరవడుతుంది. వ్యక్తుల క్రెడిట్ రేటింగ్ సరిగ్గా లేకపోతే ఫైనాన్స్ సంస్థలు రుణాలు తిరస్కరించినట్లే, ఈ ‘గ్రే లిస్టు’లో ఉన్న దేశాలకు ప్రపంచదేశాలు ఆర్ధికసహాయం అందించవు. ఇప్పుడు పాక్ పేరు కూడా ఆ జాబితాలో చేర్చబడింది కనుక దాని ఆర్ధిక ఇబ్బందులు రెట్టింపు కావచ్చు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది.      


Related Post