పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ హత్య?

June 27, 2018
img

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మరియు పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ పై కరాచీలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని, ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయారని  సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలలో నిజం లేదని తేలింది. 

జూలై 25వ తేదీన పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. పాకిస్తాన్ ఎన్నికల సమయంలో ప్రధాన అభ్యర్ధులు హత్యకు గురికావడం సాధారణమైన విషయమే కనుక సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఒక వీడియో ఆధారంగా ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆ వీడియోలో వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ కాదని స్పష్టం అవుతోంది.

వచ్చే నెల జరుగబోయే ఎన్నికలలో ఇమ్రాన్ ఖాన్ నాలుగు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఇవాళ్ళ ఇస్లామాబాద్ లో జరుగబోయే బారీ బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. ఆ తరువాత జూన్ 28,29 తేదీలలో లాహోర్ లో ఎన్నికల ప్రచారసభలో పాల్గొనబోతున్నారు. 

పాకిస్తాన్ మీడియాలో కూడా కనబడని ఇటువంటి సంచలన వార్తలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం చూస్తే ‘సంచలన వార్తలను’ ప్రచారం చేసేందుకు సోషల్ మీడియా ఎంత ఆత్రంగా ఉందో అర్ధమవుతోంది.

Related Post