కూతురు ముందు ట్రంప్ జీరో?

June 21, 2018
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని గడగడలాదిస్తే అయన కుమార్తె ఇవాంకా ట్రంప్ ఆయనను గడగడలాడిస్తుందని జోక్. అది నిజమేనని నిరూపిస్తూ, తన ప్రభుత్వం అమలుచేస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కూతురు కూడా తప్పు పట్టడంతో డోనాల్డ్ ట్రంప్ దానికి స్వస్తిపలికారు. 

ఈ విధానంలో అమెరికాలో ఆశ్రయంకోరి వస్తున్నవారి పిల్లలను, వారి తల్లితండ్రుల నుంచి వేరుచేసి వేరే క్యాంప్ లలో ఉంచుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు తల్లితండ్రుల కోసం ఏడుస్తున్న ఫోటోలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియోలోను, సోషల్ మీడియాలోని విస్తృతంగా వచ్చాయి. వాటిని చూసిన ట్రంప్ భార్య మేలానియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్ ఇద్దరూ తప్పుపట్టారు. భార్య విమర్శలను ట్రంప్ పెద్దగా పట్టించుకోలేదు కానీ కూతురు తప్పుపట్టడంతో ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. 

ఇక నుంచి పిల్లలతో సహా వారి తల్లితండ్రులు ఇమ్మిగ్రేషన్ అధికారుల విచారణకు హాజరుకావలసి ఉంటుందని ట్రంప్ చెప్పారు.    


Related Post