ప్రవాస భారతీయులకు ట్రంప్ సర్కార్ షాక్

June 16, 2018
img

ప్రవాస భారతీయులకు ట్రంప్ సర్కార్ పెద్ద షాక్ ఇచ్చింది. త్వరలో హెచ్-4 వీసాలను  రద్దు చేయబోతున్నట్లు ప్రకటించింది. 

హెచ్-1 బి వీసాలతో అమెరికాలో నివసిస్తున్నవారి జీవిత భాగస్వాములు  ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించేవే హెచ్-4 వీసాలు. ఇదివరకు బారాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వీటిని అనుమతించారు. కానీ వీటి వలన అమెరికన్లకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయని భావిస్తున్న ట్రంప్ సర్కార్ హెచ్-4 వీసాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తరువాత చట్టసభలలో పెట్టి దానికి ఆమోదముద్రవేస్తే అమలులోకి వస్తుంది.

ఈ నిర్ణయం వలన సుమారు 75,000 మంది ప్రవాస భారతీయులు నష్టపోతారని ఒక ప్రాధమిక అంచనా. ఈ చట్టం అమలులోకి వస్తే ఇంతవరకు హెచ్-4 వీసాలతో ఉద్యోగాలు చేస్తున్నవారు ఇంట్లోనే కూర్చోవలసి ఉంటుంది. అది సాధ్యం కాదనుకుంటే భారత్ తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఇది కేవలం ప్రవాస భారతీయుల సమస్య మాత్రమే కాదు. అమెరికాలో స్థిరపడిన లక్షలాది విదేశీయులందరిది. కనుక ఒకేసారి కొన్ని లక్షలమంది విదేశీయులు నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంది. కానీ ఈ నిర్ణయం వలన అంతమంది అమెరికన్లకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి కనుక ఈ ప్రతిపాదనను ప్రతిపక్షాలు, మీడియా, చట్టసభలు కూడా వ్యతిరేకించకపోవచ్చు. అంటే ఇది వాస్తవరూపం దాల్చడానికి ఎక్కువ సమయం పట్టదని భావించవచ్చు.  

Related Post