జనరల్ మోటార్స్ సి.ఎఫ్.ఓ.గా తెలుగు మహిళ

June 15, 2018
img

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆటోమొబైల్స్ సంస్థ జనరల్ మోటార్స్ కు దివ్య సూర్యదేవర (39) తెలుగు మహిళ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సి.ఎఫ్.ఓ)గా నియమితులయ్యారు. 

ఆమె తల్లితండ్రులు చెన్నైలో స్థిరపడటం చేత ఆమె అక్కడే చదువుకున్నారు. ఆమె చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి చాలా కష్టాలు అనుభస్తూనే ఆమెను చదివించారు. దివ్య చిన్నప్పటి నుంచే చదువులలో చాలా చురుకుగా ఉన్నందున చకచకా చదువులు పూర్తిచేశారు. మద్రాస్ యూనివర్సిటీలో కామర్స్ లో మాస్టర్స్ చేసిణ తరువాత అమెరికా వెళ్లి హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబిఏ చేశారు. తరువాత అక్కడే కొంతకాలం యుబిఎస్ బ్యాంక్ లో ఉద్యోగం చేశారు. తరువాత జనరల్ మోటార్స్ లో చేరారు. అప్పటికి ఆమె వయసు 25సం.లు. అప్పటి నుంచి ఆమె ఇక వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం ఎన్నడూ ఏర్పడలేదు. ఆ సంస్థలో అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (కార్పోరేట్ ఫైనాన్స్) హోదాకు చేరుకున్నారు. ప్రస్తుతం సి.ఎఫ్.ఓ.గా చేస్తున్న చక్ స్టీవెన్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన పదవీ విరమణ చేస్తారు. అదేరోజునే దివ్య సూర్యదేవర ఆ పదవీ బాధ్యతలు చేపడతారు.  

దివ్య భర్త పేరు రాజ్ సూర్యదేవర. అయన న్యూయార్క్ లో వ్యాపారం చేస్తున్నారు. ఆ దంపతులకు ఒక కుమార్తె ఉంది. పురుషాధిక్యత గల ఆతోమోబిఅల్ రంగంలో ఒక మహిళ అతి తక్కువ కాలంలో ఇంత ఉన్నత స్థానానికి చేరుకోవడం చాలా గొప్ప విషయమే. ఆమె మన భారతీయురాలు...తెలుగు మహిళ కావడం మనందరికీ గర్వకారణం. 

Related Post