ట్రంప్-కిమ్ జాంగ్ ఉన్ సమావేశం రేపే!

June 11, 2018
img

ప్రపంచదేశాలన్నీ ఆత్రంగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్-ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ల సమావేశం మంగళవారం సింగపూర్ లో జరుగబోతోంది. దీనిలో పాల్గొనేందుకు వారిరువురూ ఆదివారం సాయంత్రమే సింగపూర్ చేరుకున్నారు. వారిరువురూ సింగపూర్ లోని కపెల్లా హోటల్ లో రేపు సమావేశం కాబోతున్నారు. 

వారి ఈ సమావేశం ప్రధానోదేశ్యం కొరియా ద్వీపకల్పంలో మళ్ళీ శాంతి నెలకొల్పడం. అందుకోసం ఉత్తరకొరియా వద్ద ఉన్న అణ్వాయుధాలను, వాటిని తయారుచేసే వ్యవస్థలను సమూలంగా నిర్వీర్యం చేయాలని అమెరికా అధ్యక్షుడు కోరబోతున్నట్లు సమాచారం. అయితే అందుకు కిమ్ జాంగ్ ఉన్ అంగీకరిస్తారా? అంగీకరించేమాటయితే అయన ఏమి డిమాండ్లు అమెరికా ముందుంచుతారు? అమెరికాపై అణ్వాయుధాలను ప్రయోగించి, ప్రపంచ చిత్రపఠంలో నుంచి అమెరికా కనబడకుండా చేసేస్తానని ప్రగల్భాలు పలికిన కిమ్ జాంగ్ ఉన్ హటాత్తుగా మనసు మారడానికి కారాణాలు ఏమిటి? యుద్ధోన్మాదంతో ఊగిపోయే అయన అమెరికా అధ్యక్షుడితో ఈ సమావేశంలో ఎందుకు పాల్గొంటున్నారు?ఒకవేళ ఆయన అణ్వాయుధాలను నిర్వీర్యం చేయడానికి అంగీకరించకపోతే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏమి చేస్తారు?అనే ప్రశ్నలన్నిటికీ రేపు వారి సమావేశం ముగిసిన తరువాత సమాధానాలు లభిస్తాయని ఆశిద్దాం.          


Related Post