కెనడా భారతీయ రెస్టారెంట్ లో ప్రేలుడు

May 25, 2018
img

కెనడాలోని ఒంటారియో అనే పట్టణంలో గల ప్రముఖ భారతీయ రెస్టారెంట్ ‘బాంబే భేల్’ లో గురువారం రారటి సుమారు 10.30 గంటలకు బారీ ప్రేలుడు జరిగింది. ఆ ఘటనలో 10 మంది మృతి చెందగా మరో 15మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ప్రేలుడు జరిగిన సమయంలో రెస్టారెంటులో చాలామంది భారతీయులున్నారని సమాచారం. ఈ ప్రేలుడుకి కారణం, చనిపోయిన, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

Related Post