16 ఏళ్ళకే అంత సేవా దృక్పదమా?

May 03, 2018
img

అతని పేరు ప్రణీత్ ఆళ్ళ. వయసు 16. పెన్సల్వేనియా హై స్కూలు విద్యార్ధి...అంటే ఏమి చేస్తుంటాడో తేలికగానే ఊహించుకోవచ్చు. కానీ మనలో చాలామంది చేయలేని గొప్ప గొప్ప పనులు అతను చేస్తున్నాడు. బాల్యం నుంచే సేవాభావం కనబరుస్తూ తను దాచుకొన్న డబ్బులను పేద విద్యార్ధులు, ప్రజలకు పంచిపెడుతుండేవాడు. వయసుతో పాటు అతనిలో ఆ సేవాభావం కూడా పెరిగింది. 16 ఏళ్ళు వయసు వచ్చేసరికి ఒక అరడజనుకు పైగా సేవా సంస్థలను స్థాపించి, వాటి ద్వారా సమాజంలో నిరుపేదలకు పేద విద్యార్ధులకు చాలా సహాయం చేస్తున్నాడు.


ఇంకా లోకం గురించి పూర్తిగా తెలియని ఆ 16ఏళ్ళ చిన్న కుర్రాడు పేదరిక నిర్మూలన చేయడానికి ఉడతాభక్తిగా తన వంతు కృషి చేస్తున్నానని చెప్తాడు ప్రణీత్. ముఖ్యంగా నిరుపేద, అనాధ, శారీరిక, మానసిక వికలాంగ పిల్లలకు అవసరమైన సహాయసహకారాలు అందించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు.  


ఎన్ఆర్ఐ యూత్ క్లబ్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ప్రణీత్ తన సేవలను విసృతపరిచేందుకు లాభాపేక్షలేని ఎన్ఆర్ఐ యూత్ క్లబ్ www.nriyouthclub.org , www.servetoday.org , www.peerlift.org మొదలైన ఆన్ లైన్ సంస్థలను స్థాపించి వాటి ద్వారా తన వంటి సేవాభావం ఉన్నవారిని ఆకర్షించి, ప్రేరణ కలిగిస్తూ అందరూ కలిసి విరాళాలు సేకరిస్తూ దానిని సమాజంలో నిరుపేదలు, ముఖ్యంగా పిల్లలు, నిరుపేద విద్యార్ధుల కోసం వినియోగిస్తున్నాడు.


ఎన్.ఆర్.ఐ. యూత్ క్లబ్ అధ్వర్యంలో జరిపిన సేవా కార్యక్రమాల ఫోటోలు: 


https://drive.google.com/drive/folders/1rpReEt9ciu8Lt3Fq7NCWQyU8yqge_dw9?usp=sharing 


వాటిలో www.peerlift.org ద్వారా తనవంటి అనేకమంది హైస్కూల్ విద్యార్ధులను సైతం ఈ మహత్కార్యంలో భాగస్వాములుగా చేర్చగలుగుతున్నాడు. తనకున్న కంప్యూటర్, సాఫ్ట్ వేర్ పరిజ్ఞానంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు అవసరమైన సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ కూడా తయారుచేసి సహాయపడుతున్నాడు.


ఉదాహరణకు అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ప్రతీ ఏటా దీపావళి పండుగ సందర్భంగా నిరుపేద విద్యార్ధులకు బట్టలు, ఆహార వస్తువులు, నోటు పుస్తకాలు, స్కూలు బ్యాగులు మొదలైనవి అందిస్తుంటారు. www.diwalifooddrive.org అనే ఆన్-లైన్ ప్లాట్ ఫాం ద్వారా వాటిని సేకరిస్తుంటారు. ప్రణీత్ రూపొందించిన సాఫ్ట్ వేర్ అప్లికేషన్ నే ఆ సంస్థ వినియోగిస్తోంది. ఈ సంస్థ యూత్ వింగ్ కు ప్రణీత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. అతను ఉంటున్న పెన్సల్వేనియా ప్రాంతం నుంచే ప్రతి ఏటా  ఈ సంస్థ సుమారు 50,000 పౌండ్ల ఆహార వస్తువులు సేకరిస్తుంది.


ఎన్.ఆర్.ఐ. యూత్ క్లబ్ ఫేస్ బుక్ కవరేజ్:  https://www.facebook.com/NRIYouth 


ఒకసారి తన తల్లితండ్రులతో కలిసి భారత్ వచ్చిన ప్రణీత్ ఇక్కడి పేదప్రజల దయనీయపరిస్థితులు చూసి చలించిపోయాడు. చిన్నప్పుడే ఎయిడ్స్ మహమ్మారి బారినపడి సమాజం చేత తిరస్కరింపబడిన సుమారు 80 మంది చిన్న పిల్లలకు ఆశ్రయం కల్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ‘హ్యాపీ హోమ్స్’ అనే సంస్థను సందర్శించి, అక్కడ వారి పరిస్థితులు చూసి చలించిపోయి, సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ రూపొందించడం ద్వారా తను సంపాదించిన డబ్బునంతా ఇచ్చేశాడు. అంతేకాదు ఆ సంస్థకు ఫేస్ బుక్ లో ఒక పేజి క్రియేట్ చేసి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సహకారంతో సుమారు 25,000 డాలర్లు విరాళాలు సేకరించి అందించాడు.


అయితే దాతలు అందించే విరాళాలు ఏవిధంగా ఖర్చు అవుతున్నాయో తెలుసుకొనేందుకు వీలుగా పారదర్శకమైన మరొక సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ను రూపొందించాడు ప్రణీత్. అతను స్థాపించిన ఆన్-లైన్ సంస్థలతో సహా అనేక ఇతర సేవాసంస్థలు కూడా దానిని వినియోగించుకొంటున్నాయి. దీంతో అతను స్థాపించిన సంస్థలకు దాతలు బారీగా విరాళాలు అందించడం మొదలుపెట్టారు. ఆవిధంగా ప్రణీత్ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ద్వారా 250,000 డాలర్లు సేకరించి, అర్హులైన పేదలకు అవసరమైన ఏర్పాట్లు చేయగలిగారు. అటు అమెరికాలోను, ఇటు భారత్ లోను నిరుపేదలకు, పేద విద్యార్ధులకు వారు ఆహారం, పుస్తకాలు,స్కాలర్ షిప్పులు ఇంకా వారికి అవసరమైన అన్నిరకాల సహాయసహకారాలు అందిస్తున్నారు.


ఈ యువ సమాజసేవాకర్తల కృషిని అమెరికాలో పలు సంస్థలు గుర్తించి అవార్డులతో సన్మానించాయి. ప్రూడేన్షియల్ ఫైనాన్షియల్ అనే సంస్థ ‘స్పిరిట్ ఆఫ్ కమ్యూనిటీ అవార్డ్స్’ పేరిట ఇటువంటివారికి అవార్డులు ప్రధానం చేస్తుంటుంది. ఆ ప్రతిష్టాత్మకమైన ‘పెన్సల్వేనియా యూత్ సర్వీస్ అవార్డు’ ప్రణీత్ కు లభించింది. అంతేకాదు..అతను ఇంకా ప్రెసిడేన్షియల్ సర్వీస్ అవార్డ్, ‘పెన్సల్వేనియా విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి నుంచి ప్రశంశలు అందుకొన్నారు. తెలంగాణా ప్రభుత్వం కూడా అతను చేస్తున్న కృషిని గుర్తించి ‘వాలంటీర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ప్రధానం చేసింది.

 

Praneeth non profit websites

nriyouthclub.org

districtnri.org

diwalifooddrive.org

servtoday.org

peerlift.org









Related Post