న్యూజెర్సీలో తెలుగువారి ఉగాది వేడుకలు

March 29, 2018
img

 తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ న్యూజెర్సీ అధ్వర్యంలో మార్చి 31న ఉగాది వేడుకలను జరుపుకొంటున్నారు.  ఆరోజు మధ్యాహ్నం 11.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈస్టర్న్ రీజియనల్ హైస్కూలు, 1401 లారెల్ ఓక్ రోడ్, వూర్ హీస్ టౌన్ షిప్, న్యూజెర్సీలో ఈ వేడుకలు జరుపుకోబోతున్నారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి హాజరవబోతున్నారు. ఇంకా నటి అంకిత జాహ్నవి, నేపధ్య గాయనులు అదితి భావరాజు, శృతి నండూరి, మిస్ టీన్ ఇండియా-యుఎస్ఏ-2017 స్వప్న మనం, మిస్ సౌత్ ఏసియా ఇంటర్నేషనల్-2014 ప్రత్యూష గూడూరు, అమెరికా వాయుసేనలో పనిచేస్తున్న అరుణ్ కుమార్ తదితరులు హాజరుకాబోతున్నారు.

ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు వినోదపోటీలు ఉంటాయి. ఈ కార్యక్రమాలకు శ్రీలక్ష్మి కులకర్ణి యాంకర్ గా వ్యవహరించబోతున్నారు.

ఈ వేడుకలలో పాల్గొనే అతిధుల కోసం మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం స్నాక్స్ నిర్వాహకులే ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన పెద్దలకు 15 డాలర్లు, 5-12 సం.లలోపు పిల్లలకు 10 డాలర్లు ఎంట్రీ ఫీజుగా నిర్ణయించారు.

ఈ వేడుకలకు సంబంధించి పూర్తి వివరాల కోసం www.tasj.org  వెబ్ సైటు సందర్శించవచ్చు లేదా  info@tasj.org కు ఈమెయిల్ ద్వారా కానీ లేదా 856-336-8275 ఫోన్ చేసి గానీ తెలుసుకోవచ్చు.  ఈ వేడుకలలో పాల్గొనదలచినవారికి ttps://tinyurl.com/tasjugadi2018  అనే వెబ్ సైట్ లో ఎంట్రీ టికెట్స్ కోసం లభిస్తాయి.

ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్: భారత్ సంస్కృతి, ప్లాటినం స్పాన్సర్స్ గా స్ప్రూస్ ఇన్ఫో టెక్ మరియు వైన్ లిజెండ్ సంస్థలు, సిల్వర్ స్పాన్సర్స్: వేకెర్ట్ లక్ష్మి ‘లక్కీ’ కసుకుర్తి, న్యూయార్క్ లైఫ్, పిఎన్జి జ్యూవెలర్స్, రీమాక్స్, లెర్నింగ్ మైండ్స్, పద్మాస్ బ్యూటీ సెలూన్ గోవర్ధన్ రెడ్డి పట్లోళ్ళ, ఇందు కాశీమహంతి, అంజన్ మండల, ప్రేమల్ పరేఖ్.

మీడియా పార్ట్నర్స్: ఎన్.టీవి, ఏపి 24x7, వి6, సాక్షి, ఈ-బాక్స్, మైతెలంగాణా.కామ్, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మరియు సంధ్య విష్ణు ఫోటోగ్రఫీ. ఈ వేడుకలకు తెలుగువారందరూ ఆహ్వానితులే.  

Related Post