ఖమ్మం ఎన్.ఆర్.ఐ.ఫౌండేషన్ వితరణ

March 23, 2018
img

మనిషి బ్రతకడానికి డబ్బు సంపాదన అవసరమే కానీ అదే జీవిత పరమార్ధం కాదు. ప్రతీ మనిషి ఈ భూమ్మీదకు ఒట్టి చేతులతోనే వస్తాడు ఒట్టి చేతులతోనేపోతాడని అందరికీ తెలుసు కానీ అధికశాతం మంది భోగభాగ్యాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. కొద్ది మంది మాత్రమే సాటి మనిషిని ఆదుకోవాలని తపిస్తుంటారు. 

తెలంగాణా రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడినవారు అదే సర్వస్వం అనుకోకుండా రాష్ట్రాభివృద్ధికి సమాజంలో నిరుపేదలు, అసహాయులను తోడ్పడటానికి ఎప్పుడూ ముందుంటారు. 

అందుకోసం వారు జిల్లాలవారీగా ఎన్.ఆర్.ఐ.ఫౌండేషన్ లు ఏర్పాటు చేసుకొని ఆయా జిల్లాలలో అభివృద్ధి పనులలో భాగస్వాములు అవుతున్నారు. 

ఖమ్మం జిల్లా ఎన్.ఆర్.ఐ.ఫౌండేషన్, స్థానిక వర ప్రదాత షిరిడిసాయి మందిర పాలక మండలి సభ్యులు కలిసి దివ్యాంగులకు 21 ట్రై సైకిళ్ళను అందజేశారు. వాటిని అందుకొంటున్నప్పుడు ఆ దివ్యాంగుల కళ్ళలో కనిపించిన సంతోషం చూసి ఆ కార్యక్రమానికి అతిధులుగా హాజరైనవారిలో కొంతమంది యధాశక్తిన విరాళాలు అందజేయడం విశేషం. ఈ వితరణ కార్యక్రమంలో జిల్లా ఎన్.ఆర్.ఐ.ఫౌండేషన్ సభ్యులు బండి నాగేశ్వర రావు, పసుమర్తి రంగారావు, సాయి మందిర పాలకమండలి అధ్యక్షులు వేములపల్లి వెంకటేశ్వర్లు, ఖమ్మం ఏసిపి కె.సురేష్, వరలక్షి(ICDS-PD), మందా కృష్ణ, అన్నం శ్రీనివాసరావు, దొడ్డపనేని కనకయ్య, వెంకట రామ్, మునుకుంట్ల సుబ్బారావు, కాలువల రాజా, సురేష్, ఖాదర్ బాబు, ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ యూత్ క్లబ్ సభ్యులు, ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సభ్యుల పిల్లలు హాజరయ్యారు. 


Related Post