స్టీఫెన్ హాకింగ్ ఇక లేరు

March 14, 2018
img

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) బుదవారం ఉదయం కేంబ్రిడ్జిలోని తన నివాసంలో కన్నుమూశారు. అయన కుటుంబసభ్యులు స్వయంగా ఈ విషయన్ని మీడియాకు తెలియజేశారు.

స్టీఫెన్ విలయమ్ హాకింగ్ 1942, జనవరి 8న లండన్ లో జన్మించారు. అయన 21 ఏళ్ళ వయసులోనే మోటార్‌ న్యూరాన్‌ అనే వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధి కారణంగా అప్పటి నుంచి అయన శరీరావాయలు ఒకటొకటిగా పక్షవాతానికి గురయ్యాయి. తల, కళ్ళు కూడా కదిలించలేని స్థితి. ఇక మెడ క్రింది భాగం అంతా చచ్చుబడిపోయింది. అటువంటి పరిస్థితిలోనే అయన ప్రత్యేకంగా రూపొందించబడిన చక్రాల కుర్చీలో కూర్చొని కంప్యూటర్ సహాయంతో అనేక ఖగోళ పరిశోధనలు చేశారు. అనేక అద్భుతమైన పుస్తకాలు రచించారు. గురుత్వాకర్షణ ఏకతత్వ సిద్దాంతం, సాపేక్ష సిద్దాంతం కనుగొన్నారు. కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) నుంచి రేడియేషన్ ఉత్పత్తి అవుతుందని కనుగొన్నారు. వాతావరణంలో తీవ్రమైన మార్పుల కారణంగా భవిష్యత్ లో భూమండలం నివాస యోగ్యానికి పనికిరాకపోవచ్చునని కనుక మానవులు జీవించడానికి అనువైన గ్రహాలను పరిశోధించి కనుగొనాలని చెప్పేవారు. హాకింగ్ రచించిన ‘బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’ అనే పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అనేకబాషలలోకి అనువదింపపడింది. కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. తెలుగులో ‘కాలం కధ’ పేరుతో అనువదింపబడింది. 

విశేషమేమిటంటే, స్టీఫెన్ హాకింగ్ కు ఇద్దరు భార్యలు. మొదటిబార్య జాన్ విల్డే యూనివర్సిటీలో పరిచయం అయ్యింది. 1965లో వారిరువురు పెళ్ళి చేసుకొన్నారు. వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు. కొన్ని కారణాల వలన వారు 1995లో విడిపోయారు. మళ్ళీ అదే సంవత్సరంలో స్టీఫెన్ ఎలైన్ మాసన్ అనే ఆమెను వివాహం చేసుకొన్నారు. ఆమె స్టీఫెన్ కు చాలా కాలం సేవలు చేసింది. కానీ ఆమెతో 2006లో విడిపోయారు. దాదాపు జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికీ ప్రపంచంలో మరెవరూ చేయలేనన్ని గొప్ప పరిశోధనలు చేసి చివరికి తాను శోధిస్తున్న ఆ కానరాని లోకాలకే తరలివెళ్ళిపోయారు స్టీఫెన్ విలియం హాకింగ్.     


Related Post