ట్రంప్ ను వెంటాడుతున్న పోర్న్ స్టార్

March 07, 2018
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై పోర్న్ స్టార్ స్టోరీ డేనియల్స్ కాలిఫోర్నియా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దానిలో ఆమె డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాకమునుపు తనతో శృంగారం జీవితం గడిపారని, కానీ అధ్యక్ష ఎన్నికలకు ముందు అది బయటకు పొక్కితే రాజకీయంగా చాలా నష్టం జరుగుతుందనే భయంతో ట్రంప్ తన న్యాయవాది మైకేల్ కోహెన్ ద్వారా తనకు 1,30,000 డాలర్లు ముట్టజెప్పి 2016 అక్టోబర్ 28వ తేదీన ఒక ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకొన్నారని పేర్కొంది. ట్రంప్ చాలా ముందుజాగ్రత్త పడుతూ అసలు పేర్లకు బదులు వేరే పేర్లతో ఆ ఒప్పందాన్ని తయారు చేయించారని ఆమె ఆరోపించారు. అయితే దానిలో ట్రంప్ సంతకం చేయలేదని ఆమె పేర్కొంది. చట్టబద్దత లేని ఆ ఒప్పందం కారణంగా తమ మద్య జరిగిన రాసలీలలను బయటపెట్టడానికి వీలులేదని డోనాల్డ్ ట్రంప్ తనను ఒత్తిడి చేస్తున్నారని ఆమె పేర్కొంది. డోనాల్డ్ ట్రంప్ తనతో 2006 నుంచి సుమారు ఏడాదిపాటు శృంగార జీవితం గడిపారని ఆమె పిటిషన్ లో పేర్కొంది. తనను తీవ్ర ఒత్తిడికి గురిచేసి బలవంతంగా సంతకం చేయించుకొన్నారని తెలిపింది. తన అంగీకారం లేకుండా ఏకపక్షంగా చేయబడిన ఆ ఒప్పందంలో డోనాల్డ్ ట్రంప్ సంతకం చేయలేదు కనుక దానికి చట్టబద్దత లేదని కనుక అది చెల్లదని, దానిని రద్దు చేయాలని ఆమె న్యాయస్థానాన్ని కోరింది. 

పోర్న్ స్టార్ స్టోరీ డేనియల్స్ ఇదివరకే ట్రంప్ రాసలీలల భాగోతానని బయటపెట్టింది. ఇప్పుడు ఏకంగా న్యాయస్థానాన్నే ఆశ్రయించింది. అసలు రహస్యం బయటపెట్టేసి మళ్ళీ దానిపై కోర్టులో పిటిషన్ కూడా వేయడం ద్వారా ఆమె స్వయంగా మరోసారి తనకు, ట్రంప్ కు మద్య జరిగిన భాగోతాలను దృవీకరించి లోకానికి గట్టిగా చాటి చెప్పినట్లయింది. ట్రంప్ ఇచ్చిన డబ్బు పుచ్చుకొని, రహస్యమంత బయటపెట్టేసి ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆమె కోరడం చాలా విడ్డూరంగా ఉంది. దీనిపై ట్రంప్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Related Post