తెరాస సర్కార్ ప్రైవేట్ లిమిటెడ్: ప్రొఫెసర్ కోదండరాం

February 26, 2018
img

అమెరికాలో ఒక కార్యక్రమానికి హాజరైన టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం టెక్సాస్ నగరంలో నార్త్ అమెరికా, తెలంగాణా విద్యావంతుల వేదిక అధ్వర్యంలో ‘తెలంగాణా-మారుతున్న రాజకీయాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, “నిధులు, నీళ్ళు, ఉద్యోగాల కోసమే పోరాడి తెలంగాణా సాధించుకొన్నాము. కానీ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో పాలన సాగడం లేదు. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణాను అభివృద్ధి చేస్తుందని తెరాసకు ప్రజలు అధికారం అప్పజెప్పితే అది ఇష్టారాజ్యంగా పాలిస్తోంది. పబ్లిక్ ఎంటర్ ప్రైజస్ గా సాగవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఎంటర్ ప్రైజస్ గా మారిపోయింది. రాష్ట్రంలో అన్ని వర్గాలు తెరాస సర్కార్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యమ ఆకాంక్షలు తీరేందుకు మళ్ళీ మరో ఉద్యమం చేయక తప్పదు,” అని అన్నారు.


Related Post