ఇక అమెరికా ఉద్యోగాలు మరిచిపోవాలేమో?

February 24, 2018
img

లక్షలాది భారతీయ యువతీ యువకులు అమెరికా వెళ్ళి ఉన్నత చదువులు చదువుకోవాలని, అక్కడే మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని కలలుకంటూ ఉంటారు. అలాగే భారత్ కు చెందిన అనేక ఐటి కంపెనీలు అమెరికా సంస్థలకు తమ నిపుణులను పంపించి సేవలు అందిస్తుంటాయి. ఇకపై ఇవన్నీ కష్టమే. అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే గట్టి పట్టుదలతో ఉన్న ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, హెచ్-1 బి వీసాల జారీపై నానాటికీ ఆంక్షలు కటినతరం చేస్తున్నారు. తాజాగా థర్డ్ పార్టీ సర్వీస్ లకు సంబందించి ట్రంప్ సర్కార్ జారీ చేసిన మార్గదర్శకాలు హెచ్-1 బి వీసాలను పొందడం మరింత కష్టతరంగా మార్చివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వాటి ప్రకారం ఒక సంస్థ నియమించుకొన్న ఉద్యోగి ద్వారా వేరే సంస్థకు సేవలు అందించదలచుకొన్నప్పుడు, వీసా ఎందుకు అవసరం? సదరు ఉద్యోగి ఆ సంస్థలో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు?ఆ ఉద్యోగి అందించే ప్రత్యేక సేవలు ఏమిటి? థర్డ్ పార్టీకి ఎంతకాలం పనిచేస్తాడు?ఇదివరకు ఎప్పుడైనా ఇటువంటి ప్రత్యేక సేవలు అందించిన అనుభవం ఉందా? ఉంటే ఆ వివరాలు..మొదలైనవన్నీ సమర్పించవలసి ఉంటుంది. భారత్ తో సహా అనేక ఇతర దేశాలకు చెందిన ఐటి తదితర సంస్థలు హెచ్-1 బి వీసాల ద్వారానే థర్డ్ పార్టీలకు సేవలు అందిస్తుంటాయి. కనుక ఆ వీసాలను పొందడం మరింత కష్టం కావచ్చు.

Related Post