మళ్ళీ అమెరికా బంద్?

February 09, 2018
img

భారత్ లో రాజకీయ, సామాజిక, మతపరమైన కారణాలతో అప్పుడప్పుడు బందులు జరుగుతుంటాయి తప్ప ఆర్ధికకారణాల చేత ప్రభుత్వాలు స్తంభించిన దాఖలాలు కనబడవు కానీ అగ్రరాజ్యమైన అమెరికాలో మాత్రం ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన ఖర్చుల నిమిత్తం బిల్లులకు కాంగ్రెస్ (పార్లమెంటు) ఆమోదం పొందలేక యావత్ ప్రభుత్వ యంత్రాంగం మూసుకోవలసిన పరిస్థితులు అప్పుడప్పుడు ఏర్పడుతూనే ఉన్నాయి. క్రిందటి నెలలో ఇదే కారణం చేత మూడు రోజుల పాటు అమెరికాలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. అయితే అతికష్టం మీద ప్రతిపక్ష సభ్యులను ఒప్పించడం ఫిబ్రవరి 8వ తేదీ వరకు తాత్కాలికంగా ఆర్ధిక ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ గడువు నిన్న రాత్రితో ముగిసిపోయింది.  దానికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదముద్ర పడేవరకు మళ్ళీ ‘షట్ డౌన్’ తప్పదు. కనుక శుక్రవారం అర్ధరాత్రి నుంచి మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే ఈవిధంగా దేశంలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడటంతో ట్రంప్ సర్కార్ తీరని అప్రదిష్ట మూటగట్టుకొంటోంది.    


Related Post