తానా ఆధ్వర్యంలో సెమినార్: అపూర్వ స్పందన

February 07, 2018
img

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అధ్వర్యంలో జనవరి 28న పెన్సల్వేనియాలో టాక్స్ ఫైలింగ్స్, సేవింగ్స్, ఇన్స్యూరెన్స్ ప్లానింగ్ తదితర అంశాలపై జరిగిన సెమినార్ కు ప్రవాస భారతీయుల నుంచి మంచి స్పందన వచ్చింది. 

తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ కో-ఆర్డినేటర్ నాగరాజు నలజుల స్వాగతోపన్యాసంతో ఈ సెమినార్ మొదలైంది. అనంతరం తానా కోశాధికారి రవి పొట్లూరి తమ సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి అతిధులకు వివరించారు. తరువాత ప్రఖ్యాత ఎబిసి అకౌంటింగ్ & టాక్స్ సర్వీసస్ కు చెందిన మనీష్ జాని, న్యూయార్క్ లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థకు చెందిన శ్రీమతి లక్ష్మి మోపర్తి పన్ను చెల్లింపులు, సేవింగ్స్ మొదలైన అంశాల గురించి చాలా సరళమైన భాషలో అందరికీ అర్ధమయ్యే విధంగా వివరించారు. ఈ సందర్భంగా వారు అతిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వారి సందేహాలు తీర్చారు.


అనంతరం, ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు వారిరువురినీ తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ హరీష్ కోయ, కమిటీ చైర్మన్ వేణు సంగని సన్మానించారు. ఈ కార్యక్రమానికి అపర్ణ వాగ్వల యాంకర్ గా చేశారు. ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ తానా ఫౌండేషన్ ట్రస్టీ రవి మండలపు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో తానా ఫిలడెల్ఫియా బృందం సాయి జరుగుల, సునీల్ కోగంటి, గోపి వాగ్వాల, రామ ముద్దన, ఫణి, చలం, ఆదిత్య, వంశీ, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. ఇంకా రవి మేరెడ్డి (ఫిలడెల్ఫియా తానా అసోసియేషన్), సాంబయ్య కోటపాటి (టిఏజిడివి వైస్ ప్రెసిడెంట్), సురేష్ రెడ్డి (టాటా), శ్రీధర్ గుడల (విటిఏ) తదితర ప్రముఖులు అనేకమంది హాజరయ్యారు.

 


Related Post