ఫిబ్రవరి 9న ‘ఐటి సర్వ్’ 11-ఛాప్టర్ సదస్సు

February 03, 2018
img

ఐటి సర్వ్ అంటే ఏమిటి?

అమెరికాలో 850 కు పైగా ఐటి సంస్థలు కలిసి ఏర్పాటు చేసుకొన్న వేదికే ‘ఐటి సర్వ్.’ ఇది లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ వంటిదని చెప్పవచ్చు. ఐటి సంస్థల మధ్య నెట్ వర్క్ ఏర్పరచుకోవడానికి ఇది చక్కటి వేదికగా పనికి వస్తోంది. 

ఐటి సర్వ్ ఏమి చేస్తుంది? ప్రయోజనాలు ఏమిటి? 

ప్రపంచ వ్యాప్తంగా ఐటి రంగం వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం లేదా ఆయా సంస్థల ప్రత్యేకతలు, వాటి నూతన ఆవిష్కరణల, గురించి అందరికీ తెలిసేలా చేయడం, ఆ సంస్థలలో ఉద్యోగావకాశాలు, వాటి భర్తీ...ఇలాగ ఐటి రంగానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని ఈ ‘ఐటి సర్వ్’ అనే వేదిక  చక్కగా ఉపయోగపడుతోంది. మరో విధంగా చెప్పాలంటే అమెరికాలోని ఐటి సంస్థలను, ముఖ్యంగా భారతీయులు అధ్వర్యంలో నడుపుతున్న వివిధ సంస్థలకు, వాటి అధినేతలు, ఉన్నతోద్యోగులకు మద్య ఇది చక్కటి వారధిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా భారత్-అమెరికాలోని ఐటి సంస్థలకు, అలాగే ఐటి సంస్థలకు-భారత్, అమెరికా ప్రభుత్వాలకు మద్య ఐటి సర్వ్ ఒక వారధిగా పనిచేస్తోంది.       

ఐటి రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఏటా జరిగే వార్షిక సదస్సులలో లోతుగా చర్చించి, అవసరమైతే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి ఈ వేదిక ప్రయత్నిస్తుంది. ఒక సంస్థ పరిష్కరించలేని సమస్యను అన్నీ చేతులు కలిపి పరిష్కరించుకోగలవని ఐటి సర్వ్ నిరూపిస్తోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నందునే ఏటేటా కొత్తగా అనేక ఐటి సంస్థలు దానిలో సభ్యత్వం స్వీకరిస్తున్నాయి. ఇప్పుడు ‘ఐటి సర్వ్’ అమెరికాలో అత్యంత పెద్ద, శక్తివంతమైన వేదికగా ఎదిగి తన ఉనికిని చాటుకొంటోంది. 

దీనిలో సభ్యులుగా చేరడం ఎలా?

దీనిలో సభ్యులుగా చేరడం చాలా సులువు. ఈ లింక్ ద్వారా www.itserve.org/register ఐటి సర్వ్ అధికారిక వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఐటి సర్వ్ 11 ఛాప్టర్ కిక్ ఆఫ్ సదస్సు వేదిక: 

ఫిబ్రవరి 9వ తేదీన ఐటి సర్వ్ 11 ఛాప్టర్ కిక్ ఆఫ్ సదస్సు అమెరికాలో ఫోనిక్స్, ఆరిజోనాలో అవియానో కమ్యూనిటీ సెంటర్ లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగబోతోంది. ఐటి రంగంతో సంబంధం ఉన్న అందరూ ఈ సదస్సులో పాల్గొనవచ్చు.  

ఫిబ్రవరి 9వ తేదీన జరుగబోయే ఈ సదస్సుకు ముఖ్య అతిధులుగా ఆరిజోనా రాష్ట్రంలో 7వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రూబెన్ గాలిగో మరియు అమెరికాలో ప్రఖ్యాత న్యాయసంస్థ ‘మూర్తి లా ఫిర్మ్’ తరపున షీలా మూర్తి హాజరుకాబోతున్నారు.  

ఈ సదస్సుకు సంబంధించి పూర్తి వివరాల కోసం లింక్స్: 

www.itserve.org

RSVP Link: http://itserve.org/meetid?id=8UXHDKRH6G 

https://www.linkedin.com/company/7794223/  

https://www.facebook.com/events/1421804174614908??ti=ia 

Related Post