ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు అయ్యాడు బ్రిటన్ మంత్రి!

January 10, 2018
img

ఇతరదేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఆయా దేశాలలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం కొత్త విషయమేమీ కాదు. అలాగే బ్రిటన్ ఎన్నికలలో పోటీ చేసి ఎంపిగా ఎన్నికైన రిషి సునక్ బ్రిటన్ కేంద్రమంత్రివర్గంలో ‘హౌసింగ్‌, కమ్యూనిటీస్‌, లోకల్‌ గవర్నమెంట్‌ మంత్రిత్వ శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విశేషమేమిటంటే అయన ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అల్లుడు. అయన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. స్టాన్ ఫోర్డ్ బిజినెస్ స్కూల్ లో తన సహా విద్యార్ధి అయిన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఆ తరువాత లండన్ నగరంలో ఒక ఆర్దికసంస్థను స్థాపించారు. 2014లో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించి ఆ మరుసటి సంవత్సరం జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలలో నార్త్‌యార్క్‌షైర్ లోని రిచ్‌మండ్‌ నుంచి పోటీ చేసి ఎంపిగా ఎన్నికయ్యారు. అయన ప్రతిభను గుర్తించిన బ్రిటన్ ప్రధానమంత్రి ధెరిసా మే ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకొని కీలకమైన మంత్రిపదవిని అప్పగించారు. 

Related Post