కాలిఫోర్నియాలో కాల్పులు

December 30, 2017
img

 2017 సంవత్సం ముగుస్తుండగా అమెరికాలో మళ్ళీ తుపాకి మోతలు మారుమ్రోగాయి. దక్షిణా కాలిఫోర్నియాలో ఎల్.ఏ.కంట్రీకి సమీపంలో ఉన్న లాంగ్ బీచ్ అనే ప్రాంతంలో ఒక న్యాయకార్యాలయం ఉన్న ఒక భవనంలో కాల్పులు జరిగాయి. స్థానిక కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు, ఇదివరకు అదే కార్యాలయంలో పనిచేసి మానేసిన  ఒక వ్యక్తి లోపలకు ప్రవేశించి, అక్కడున్న ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరిపి, తరువాత తనను తాను కాల్చుకొని చనిపోయాడు. లాంగ్ బీచ్ పోలీసుల ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ కాల్పులలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

కాల్పుల సంగతి తెలియగానే పోలీసులు, స్వాట్ టీమ్స్ ఆ భవనాన్ని చుట్టుముట్టి దానిలో ఉంటున్న పౌరులను ఖాళీ చేయించారు. కానీ లోపల ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి చనిపోయి ఉండటంతో పెద్ద ఉపద్రవం తప్పిపోయినందుకు అందరూ సంతోషించారు. అతను ఆ సంస్థ మాజీ ఉద్యోగి కావడంతో అతనిని గుర్తించడం తేలికయింది. బహుశః పాత కక్షలు ఏవో మనసులో పెట్టుకొని ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఈ కాల్పులలో గాయపడిన ఒక వ్యక్తి స్వయంగా కారు డ్రైవ్ చేసుకొంటూ ఆసుపత్రిలో చేరడం విశేషం. వెంటనే అతనికి వైద్య సహాయం అందడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. 

Related Post