మెంటల్ మదిలో రివ్యూ & రేటింగ్

November 24, 2017
img

రేటింగ్ : 3/5

కథ :

సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు) కన్ ఫ్యూజ్ గా ఉంటాడు. ఏ విషయం మీద తనకు ఓ క్లారిటీ ఉండదు. ఇలాంటి కన్ ఫ్యూజన్ స్టేట్ లో ఉండే అరవింద్ కు అన్ని విషయాలను తనకు తానుగా అర్ధం చేసుకుని జీవితం మీద ఓ మంచి ఆలోచన ఉన్న స్వేచ్చ (నివేదా పేతురాజ్) తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లికి ముందు వీరి ప్రయాణంలో ఎన్నో మలుపులు. ఒకరి గురించి ఒకరు తెలుసుకునే క్రమంలో ఎంగేజ్మెంట్ కు ముందు అరవింద్ ప్రాజెక్ట్ పని మీద ముంబై వెళ్లాసి వస్తుంది. ఇక అక్కడ రేణు అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఇంతలో స్వేచ్చకు అరవింద్ కు దూరం పెరుగుతుంది. ఇంతకీ అరవింద్ స్వేచ్చలు పెళ్లి చేసుకుంటారా..? అరవింద్ రేణుల మధ్య రిలేషన్ ఏంటి..? సినిమా కథ కంచికి ఎలా చేరింది అన్నది తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ :

తెలుగు సినిమాల్లో యువ రక్తం వస్తుండటంతో కొత్త ఆలోచనలతో సినిమాలు వస్తున్నాయి. అందులో వివేక్ ఆత్రేయా లాంటి ప్రతిభ గల దర్శకులు వస్తున్నారు. మెంటల్ మదిలో కథ కథనాలు చాలా సింపుల్ గా మన పక్కన ఇంట్లో జరిగే కథగా చెప్పుకొచ్చాడు. ఓ అనుభవం ఉన్న దర్శకుడిగా రాసుకున్న కథ మీద తనకున్న క్లారిటీకి ఫిదా అవడం గ్యారెంటీ. 

ఇక సినిమా మొత్తం క్యారక్టరైజేషన్ బలంగా సాగుతుంది. కథ ఉందా లేదా అన్నది కూడా ఆలోచన రాకుండా పాత్ర దాని స్వభావాల వల్ల కలిగే అనార్ధాలను తెర మీద అందంగా చూపించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా సాగగా సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ గా వెళ్తుంది. ఇక పతాక సన్నివేశాల్లో అయితే అందరి హృదయాలను టచ్ చేస్తుంది.

కథ కథనాలు గొప్పగా అనడం కన్నా మనసులను తాకేలా సింపుల్ అండ్ స్వీట్ గా రాసుకున్నాడు. అంతేకాదు ఎలా రాశాడో అంతే గొప్పగా ప్రెజెంట్ చేశాడు. కేవలం ఒకవర్గం అని కాకుండా అన్నివర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చేస్తుంది. పెళ్లిచూపులు తర్వాత అదే విధంగా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సినిమాగా మెంటల్ మదిలో ఉంటుంది.

నటన, సాంకేతికవర్గం :

సినిమాలో అరవింద్ కృష్ణ పాత్రలో శ్రీవిష్ణు ది బెస్ట్ అనిపించుకున్నాడు. నిన్నటి దాకా సైడ్ హీరోగా చేస్తూ వచ్చిన శ్రీ విష్ణు తనకు వచ్చిన అవకాశం అన్నివిధాలుగా వాడుకున్నాడు. ఇక స్వేచ్చగా నివేదా కూడా బాగా చేసింది. తెలుగులో ఆమెకు మొదటి సినిమా అయినా బాగా ఆకట్టుకుంది. ఇక రేణుగా అమృత అలరించింది. శివాజిరాజా తండ్రి పాత్రలో సహజంగా నటించి మెప్పించాడు. సినిమా మొత్తం మూడు పాత్రల మీదే అధిక భాగం నడిపించాడు దర్శకుడు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. వివేక్ ఆత్రేయ దర్శకత్వం ప్రతిభ అద్భుతం.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రతి ఒక్క ఆడియెన్ సినిమా కథకు ఎంగేజ్ అయ్యేలా చేశాడు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ బాగుంది. సినిమాకు అది ఓ మంచి హెల్ప్ అయ్యింది. వేదరామన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక రాజ్ కందుకూరి ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా రిచ్ నెస్ ను తెచ్చిపెట్టాయి.

ఒక్కమాటలో :

పెళ్లిచూపులు తర్వాత మెంటల్ మదిలో మనసుని పలుకరించిన సినిమా..!  

Related Post