గృహం రివ్యూ & రేటింగ్

November 17, 2017
img

రేటింగ్ : 3/5

కథ : 

సర్జన్ అయిన కృష్ణకుమార్ (సిద్ధార్థ్) తన ఎదురు ఇంట్లో దిగిన వాళ్లు ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతుండగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తన హాస్పిటల్ లో సైకాలజిస్ట్ ప్రసాద్ (సురేష్) సహాయంతో ఆ ఇంట్లో సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆ ఇంట్లో దెయ్యం ఉందని కనిపెడతారు. ఇంట్లో ఉన్న జెన్నీ (అనీషా) ఒంట్లోకి ప్రవేశించిన దెయ్యం రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటుంది. అసలు జెన్నికి పట్టిన దెయ్యం ఎవరిది..? ఆమెపై ఎందుకు పగ పట్టింది..? అసలు ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలు ఎందుకొచ్చాయి.. అన్నది అసలు కథ.

విశ్లేషణ :

మిలింద్ రావ్ డైరక్షన్ లో వచ్చిన ఈ గృహం పక్కా హర్రర్ మూవీ అని చెప్పొచ్చు. కథ కథనాల్లో దర్శకుడు ఎక్కడ వేరే కాన్సెప్ట్ జోలికి వెళ్లలేదు. సినిమా మొదలు పెట్టడం సిద్ధార్థ్, ఆండ్రియా రొమాంటిక్ సీన్స్ తో మొదలు పెట్టి ఆ తర్వాత భయపెట్టడం చేస్తాడు. హర్రర్ సినిమా అంటే ఇదే అన్నట్టు ఇటీవల వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు.

సినిమాలో ట్విస్ట్ రివీల్ అవ్వడం.. అసలు విలన్ సిద్ధార్థ్ అని తేలే విధానం రివీల్ చేయడం బాగుంటుంది. హర్రర్ సినిమా అంటే ఎలాంటి అంశాలు ఉండాలో వాటిని కరెక్ట్ గా ఉంచారు. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగా రాబట్టుకున్నాడు. టేకింగ్ పరంగా కూడా సినిమా ఆడియెన్స్ మూడ్ సెట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

తెలుగులో సిద్ధార్థ్ కు ఫాలోయింగ్ తగ్గింది అనుకున్న టైంలో గృహంతో హర్రర్ అటెంప్ట్ చేశాడు సిద్ధార్థ్. కచ్చితంగా తెలుగులో తనకు మళ్లీ హిట్ వచ్చినట్టే అని చెప్పొచ్చు. 

నటన, సాంకేతికవర్గం :

సిద్ధార్థ్ నటన ఎప్పటిలానే ఆకట్టుకున్నాడు. క్రిష్ గా సిద్ధార్థ్ మరోసారి తన సత్తా చాటాడు. క్లైమాక్స్ లో తన యాక్టింగ్ సూపర్. ఇక సినిమాలో సిద్ధు తర్వాత అనీషా యాక్టింగ్ లో అదరగొట్టింది. ఇంటర్వల్ టైంలో అనీషా స్టీల్ ద షో అని చెప్పొచ్చు. అతుల్ కులకర్ణి ఇచ్చిన పాత్రకు నాయం చేశాడు. సురేష్ కూడా మంచి పాత్రలో కనిపించాడు. ఆండ్రియా రెగ్యులర్ గా ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలు పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక గృహం టెక్నికల్ టీం విషయానికొస్తే.. మిలింద్ రావ్ కథ కథనాల మీద తన పర్ఫెక్షన్ చూపించాడు. సినిమాకు తన ప్రతిభ గుర్తిస్తారు. శ్రీయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో మేజర్ రోల్ ప్లే చేసింది తన కెమెరా వర్క్. ఇక గిరిష్ సంగీతం సినిమాకు హెల్ప్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సిద్ధార్థ్ నిర్మాతగా బడ్జెట్ ఎంత కావాలో అంత పెట్టాడు.

ఒక్కమాటలో :

సిద్ధార్థ్ గృహం.. పక్కా హర్రర్ అటెంప్ట్..!


Related Post