మహానుభావుడు రివ్యూ & రేటింగ్

September 29, 2017
img

రేటింగ్ : 2.75/5

కథ :

ఆనంద్ (శర్వానంద్) ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్.. తనకున్న ఓసిడి ప్రాబ్లెం గురించి అందరిని భయపెడుతుంటాడు. అతిశుభ్రత అనే రోగంతో జీవనం సాగిస్తున్న అతని లైఫ్ లోకి మేఘన (మెహెరిన్) వస్తుంది. ఓ చిన్న స్వచ్చ భారత్ ఎపిసోడ్ తో ఆనంద్ జీవితంలోకి ఎంటర్ అయిన మేఘన మనోడి మనసు దోచేస్తుంది. అఫ్కోర్స్ ఆనంద్ ప్రపోజల్స్ కు మేఘన కూడా ఓకే అంటుంది. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్ మన వాడి అతి శుభ్రత వల్ల తన మేఘన తండ్రి రామరాజు(నాజర్)ని అవమానిస్తాడు ఆనంద్. ఒకానొక సందర్భంగాలో కష్టాల్లో ఉన్న మెహెరిన్ ను విడిచి వెళ్తాడు ఆనంద్. అందుకే అతని మీద ప్రేమ ఉన్న దూరం చేసుకుంటుంది. ఈ టైంలో ఆమె ప్రేమను పొందేందుకు ఆమె ఊరికి వెళ్తాడు ఆనంద్. అక్కడ మేఘన ప్రేమను దక్కించుకోవడానికి చివర్గా ఊరి పరువు కాపాడే కుస్తి పట్టుకి దిగాల్సి వస్తుంది. మరి ఆనంద్ చివరకు ఏం చేశాడు..? తనకున్న ఓసిడి ప్రాబ్లెం నుండి బయట పడ్డాడా అన్నది అసలు కథ.

విశ్లేషణ :

సినిమా కథ రొటీన్ గా అనిపించినా కథనం లో అది కూడా కామెడీగా నడిపించిన తీరు బాగుంటుంది. మారుతి మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్నాడు. అయితే కథ విషయంలో మాత్రం ఎలాంటి కొత్తదనం ఉండదు. తన దర్శకత్వంలోనే వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాకు దీనికి దగ్గర పోలికలు ఉంటాయి. అంతేకాదు క్యారక్టరైజేషన్ తో సినిమా మొత్తం నెట్టుకొచ్చినట్టు అనిపిస్తుంది.

ఏం చేసినా ఎలా చేసినా టికెట్ కొని థియేటర్ లో కూర్చున్న వారికి ఎంటర్టైనింగ్ ఇవ్వడమే అన్నట్టు సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో మొదటి సగం కాస్త సాగదీసినా సెకండ్ హాఫ్ మొత్తం గ్రిప్పింగ్ గా రాసుకున్నారు. ఇక క్లైమాక్స్ లో కావాల్సిన ఎమోషన్ ను కూడా యాడ్ చేసి సినిమా నడిపించారు. ఓసిడి ప్రాబ్లెం ఉన్న ఓ కుర్రాడు తన లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నదే మహానుభావుడు కథ.

ఈ పండుగ సందర్భంగా వచ్చిన ఫుల్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మహానుభావుడు సినిమా అని చెప్పొచ్చు. రెండు పెద్ద సినిమాల మధ్యన కూడా వచ్చాడు అంటే కచ్చితంగా శర్వా కాన్ ఫిడెన్స్ గురించి మెచ్చుకోవాల్సిందే. 

నటన, సాంకేతికవర్గం :

శర్వానంద్ తన పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. ఓసిడి పాత్రలో శర్వా పర్ఫార్మెన్స్ ఆడియెన్స్ ను త్రిల్ చేస్తుంది. తెలుగులో ఎలాంటి పాత్రకైనా సరిపోయే యువ హీరో శర్వానంద్ సినిమా సినిమాకు దాన్ని ప్రూవ్ చేస్తున్నాడు ఈ హీరో. ఇక సినిమాలో మెహెరిన్ కౌర్ కూడా పర్వాలేదు అనిపించుకుంది. అయితే కొన్ని సీన్స్ లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ అసలు బాలేదు. నాజర్ రెగ్యులర్ గా ఆయన చేసే పాత్రలోనే అలరించారు. వెన్నెల కిశోర్ ఎప్పటిలానే నవ్వించే ప్రయత్నం చేసినా అది కుదరలేదు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. మారుతి దర్శకత్వ ప్రతిభ మరోసారి అద్భుతం అనిపించుకుంది. ముఖ్యంగా రొటీన్ కథకు మారుతి రాసుకున్న కథనం బాగుంది. అయితే కొన్ని సీన్స్ కాస్త లాజిక్స్ మిస్ అయినట్టు అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. మ్యూజిక్ థమన్ బాగానే ఇచ్చాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

ఒక్కమాటలో :

మారుతి మార్క్ మహానుభావుడు శర్వానంద్ ఏమాత్రం నిరాశ పరచలేదు.  

Related Post