యుద్ధం శరణం రివ్యూ & రేటింగ్

September 08, 2017
img

రేటింగ్ : 2.25/5

కథ :

అర్జున్ (నాగ చైతన్య) డ్రోన్ ఆపరేటర్.. ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడిపే అర్జున్ అమ్మానాన్నలను ఎవరో చంపేస్తారు.. తను చేసిన హత్యను చూసి సాక్ష్యాలుగా ఉంటారనే ఉద్దేశంతో నాయక్ (శ్రీకాంత్) అర్జున్ అమ్మానాన్నలను చంపేస్తాడు. ముందు అమ్మానాన్న కనిపించట్లేదని తిరుగుతున్న అర్జున్ కు వారు ఇక లేరని తెలుసుకుని బాధపడతాడు. ఇక వాళ్ల చావుకి కారణం అయిన నాయక్ అండ్ గ్యాంగ్ ను టార్గెట్ చేసుకుంటాడు అర్జున్. అసలు ఇంతకీ అర్జున్ ఫ్యామిలీతో నాయక్ వైరం ఏంటి..? నాయక్ ను అర్జున్ ఏం చేశాడు..? కథ ఎలా సుఖాంతం అయ్యింది అన్నది తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ :

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా సక్సెస్ తర్వాత నాగ చైతన్య హీరోగా వచ్చిన ఈ యుద్ధం శరణం ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పాలి. కథ కథనాలే కాదు ఏవి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేదు. కథ రొటీన్ అనే భావన రాగా కనీసం కథనం అయినా కొత్తగా ప్రయత్నించలేదు. 

సినిమా మొదలుపెట్టిన విధానం బాగుంటుంది. మొదటి భాగం బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాని సెకండ్ హాఫ్ పూరిగా ట్రాక్ తప్పేశారు. హీరో హీరోయిన్స్ మధ్య సీన్స్ ఆకట్టుకునేలా లేవు. ఎంటర్టైనింగ్ కూడా అనిపించదు. శ్రీకాంత్ లాంటి హీరోని విలన్ గా తీసుకున్నప్పుడు ఆ పాత్ర చాలా బలంగా రాయాల్సింది. కాని లుక్స్ వైజ్ ఓకే అనిపించినా సినిమాలో నాయక్ పాత్ర వీక్ గానే ఉంది.  

హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. మొత్తానికి యుద్ధం శరణం అంటూ వచ్చి బాక్సాఫెస్ పై యుద్ధం చేస్తాడు అనుకున్న చైతు డీలా పడేట్టే కనిపిస్తున్నాడు.

నటన, సాంకేతిక వర్గం :

అర్జున్ గా నాగ చైతన్య తన పాత్రకు న్యాయం చేశాడు. సినిమాలో చైతు చాలా కొత్తగా స్టైలిష్ గా కనిపించాడని చెప్పాలి. సినిమా మొత్తం తన మీదే నడుస్తుండటంతో ఆకట్టుకున్నాడు. లావణ్య త్రిపాఠి ఉన్నంతలో బాగానే చేసింది. ఇక రావు రమేష్, రేవతిలు ఆకట్టుకున్నారు. విలన్ గా శ్రీకాంత్ అనుకున్న రేంజ్ లో చేయలేదు. దర్శకుడు నాయక్ పాత్రని సరిగా తీర్చిదిద్దలేదని చెప్పాలి. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించారు.

ఇక యుద్ధం శరణం టెక్నికల్ టీం విషయానికొస్తే.. దర్శకుడు కథ కథనాల్లో పూర్తిగా విఫలమవగా.. మ్యూజిక్ కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

యుద్ధం శరణం చైతు ఫెయిల్యూర్ అటెంప్ట్..!   


Related Post