అర్జున్ రెడ్డి రివ్యూ & రేటింగ్

August 25, 2017
img

రేటింగ్ : 3/5

కథ : 

మెడికల్ స్టూడెంట్ అయిన అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) కాలేజ్ నుండి దూరమయ్యే క్షణంలో జూనియర్ గా ప్రీతి (షాలిని) పరిచయం అవుతుంది. ప్రీతిని చూసి మొదటి చూపులోనే ప్రేమించిన అర్జున్ రెడ్డి తర్వాత ఆమెను తన ప్రేమలో పడేసుకుంటాడు. ఇక వీరి ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోరు సరికదా ప్రీతికి వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇక అక్కడ నుండి అర్జున్ రెడ్డి ఎలా తన జీవితాన్ని మార్చుకున్నాడు.. విరహ వేదనతో అర్జున్ రెడ్డి ఎలా తయారయ్యాడు అన్నది సినిమా కథ. 

విశ్లేషణ :

ముందు నుండి చెబుతున్నట్టుగా అర్జున్ రెడ్డి విజయ్ కాన్ఫిడెన్స్ ను మరోసారి ప్రూవ్ చేసింది. కథ కథనాల్లో దర్శకుడు సందీప్ ఓ కొత్త పంథాను కొనసాగించాడు. ముఖ్యంగా హీరో క్యారక్టర్ దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది. మొదటి భాగం అంతా సాఫీసా ఎంటర్టైనింగ్ గా సాగినా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు తెలుస్తుంది.

ఇక హీరో హీరోయిన్ విడిపోయిన సీన్స్.. హీరోయిన్ మీద ప్రేమ ఉన్నా అదేదో వ్యామోహం అన్న విధంగా ముద్దు సన్నివేశాలు ఎక్కువయినట్టు అనిపిస్తుంది. సినిమాకు కనెక్ట్ అయిన వారికి సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ కు సినిమా బాగా నచ్చుతుంది. 

ఇక క్లైమాక్స్ విషయంలో దర్శకుడు ఎందుకో రొటీన్ ఫార్ములా ఫాలో అయ్యాడన్ని చెప్పొచ్చు. కథ కథనాల్లో దర్శకుడు సందీప్ తన ప్రతిభ చాటాడు.

నటన, సాంకేతిక వర్గం :

అర్జున్ రెడ్డిగా విజయ్ మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ చూపించాడు. పెళ్లిచూపులు తర్వాత ద్వారకా వచ్చినా ఇది పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి పాత్రకు విజయ్ ప్రాణం పోశాడు. ఇక హీరోయిన్ షాలిని నటన బాగుంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి బాగానే చేశారు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

టెక్నికల్ టీం విషయానికొస్తే.. రధాన్ సంగీతం పర్వాలేదు.. రాజు తోట సినిమాటోగ్రఫీ బాగుంది. శశాంక్ ఎడిటింగ్ ఓకే అయితే డ్యూరేషన్ విషయంలో ఇంకాస్త ట్రిం చేస్తే బాగుండేది. దర్శకుడు అన్ని విధాలుగా సక్సెస్ అయ్యాడు. సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో మంచి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గానే ఉన్నాయి. 

ఒక్కమాటలో :

అర్జున్ రెడ్డి.. యూత్ ను ఎట్రాక్ట్ చేసే సినిమా.. లెక్క చెప్పి మరి హిట్ కొట్టారు చిత్రయూనిట్..!


Related Post