శమంతకమణి రివ్యూ & రేటింగ్

July 14, 2017
img

రేటింగ్ : 3/5

కథ :

కోటిశ్వరుడైన కృష్ణ తన తండ్రి సుమన్ తీసుకున్న 5 కోట్ల కారుని పోగొట్టుకుంటాడు. స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా విచారణ స్టార్ట్ చేసిన పోలీసులు పార్టీ జరిగిన ఫుటేజ్ అక్కడ అనుమానితులుగా ఉన్న ఉమ్మామహేశ్వర్ రావు(రాజేంద్ర ప్రసాద్), శివ (సందీప్ కిషన్), కార్తిక్ (ఆది)లను అరెస్ట్ చేస్తారు. విచారణలో వారు చెప్పిన విషయాలన్నిటికి సింక్ ఉండటంతో అసలు కారు ఎలా మిస్ అయ్యింది అన్నది తేలదు. ఇక్కడే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి..? ఇంతకీ ఆ నలుగురిలో కారుని ఎవరు దొంగిలిస్తారు..? అసలు దొంగరు ఎవరు..? అన్నది తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ :

సుధీర్ బాబుతో భలే మంచి రోజు తీసిన దర్శకుడు శ్రీరాం ఆదిత్య డైరెక్ట్ చేసిన శమంతకమణి నలుగురు యువ హీరోల మల్టీస్టారర్ మూవీగా వచ్చింది. కారు పోయిన సీన్ తో మొదలయ్యే సినిమా ఎన్నో ట్విస్టులు ఎన్నో మ్యాజిక్ లను చేసి ఫైనల్ గా కారు దొరికేలా చేస్తుంది. కథ సింపుల్ లైన్ గా అనిపించినా కథనంలో మాత్రం దర్శకుడు చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు.

ప్రతి ఒక్క క్యారక్టర్ ఎంతో క్లీన్ గా నీట్ గా ప్రెజెంట్ చేసేలా చూసుకున్నాడు. కథ మొత్తం నారా రోహిత్ నడిపించడం బాగుంటుంది. కృష్ణగా సుధీర్ బాబు అదే కారు ఓనర్ గా సెంటిమెంట్ తో కనబడగా.. కార్తిక్ క్యారక్టర్ లో ఆది అదరగొట్టేశాడు. ఇక శివగా ఊరి నుండి పారిపోయి వచ్చిన పాత్రలో సందీప్ కిషన్ బాగా చేశాడు. సినిమాలో ఉమ్మమహేశ్వర్ రావుగా నటించిన రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఆకట్టుకుంటుంది.

కచ్చితంగా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ శమంతకమణి అని చెప్పొచ్చు. కథ చాలా సింపుల్ గా అనిపించినా కథనం నడిపించిన తీరు మాత్రం దర్శకుడి ప్రతిభను తెలియచేస్తుంది. సినిమా ఎక్కడ మిస్ గైడ్ చేయకుండా నలుగురు హీరోలను ఎంతవరకు వాడాలో అంతవరకు వాడారని చెప్పొచ్చు.   

నటన, సాంకేతికవర్గం :

నటనలో నలుగురు హీరోలు ఇరగదీశారు. అందరు తమదైన శైలిలో ఇచ్చిన పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశారు. కచ్చితంగా ప్రతి ఒక్కరిని అభినందించి తీరాల్సిందే. సుమన్ పాత్ర కూడా ఆకట్టుకుంది. సినిమాకు నలుగురు హీరోలు సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది నలుగురు నాలుగు స్థంభాల్లా సినిమా బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా కృషి చేశారు. రాజేంద్ర ప్రసాద్ తన సహజ నటనతో ఆకట్టుకున్నారు.

ఇక శమంతకమణి టెక్నికల్ టీం విషయానికొస్తే.. దర్శకుడు అన్ని విధాలుగా సినిమా మీద పట్టు సాధించాడు. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో సినిమా వచ్చింది. ఎడిటింగ్ కూడా బాగుంది. మ్యూజిక్ ఇంకాస్త బెటర్ గా ఇచ్చి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సినిమాకు ఎంత రిచ్ నెస్ కావాలో అంత పెట్టేశారు.

ఒక్కమాటలో :

శమంతకమణి కచ్చితంగా ఆకట్టుకునే ప్రయత్నం.. కుర్ర హీరోలు సత్తా చాటేలా నటించి మెప్పించారు..!

Related Post